మాది పొట్లం కట్టుకునే పాంప్లేట్ కాదు.. ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతే..
గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై మాజీ మంత్రి కొడాలి నాని సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో ఆయన.. జిల్లాలో గడపగడపకు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే విషయంపై నాయకులతో చర్చించారు. గ్రామాలకు సంబంధించి బూత్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారాయన. గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా ఎక్కడికక్కడ పరిష్కరించి తమ పార్టీ చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు నాని. 96శాతం ప్రజలకు పథకాలు అందించాం.. మేనిఫెస్టోలో ప్రకటించినట్టు సంక్షేమ పథకాలను […]
గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై మాజీ మంత్రి కొడాలి నాని సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ హోదాలో ఆయన.. జిల్లాలో గడపగడపకు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే విషయంపై నాయకులతో చర్చించారు. గ్రామాలకు సంబంధించి బూత్ కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారాయన. గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా ఎక్కడికక్కడ పరిష్కరించి తమ పార్టీ చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు నాని.
96శాతం ప్రజలకు పథకాలు అందించాం..
మేనిఫెస్టోలో ప్రకటించినట్టు సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లామని 96శాతం మంది ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు కొడాలి నాని. ఎన్ని పార్టీలు కలసి వచ్చినా 2024లో జగన్ ని సీఎం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. చంద్రాబాబు లాగా మిఠాయి పొట్లం కట్టుకొనే పాంప్లేట్ తాము ఇవ్వబోమని, మేనిఫెస్టో అంటే తమకు ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానం అని చెప్పారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వబోతోందనే విషయాన్ని పాంప్లేట్ రూపంలో తెలియజేస్తామన్నారు.
పేమెంట్ కోసం పనిచేసే వ్యక్తి పవన్..
పవన్, చంద్రబాబు ను చూసి తాము భయపడే ప్రసక్తి లేదన్నారు నాని. పేమెంట్ ఇస్తే చంద్రబాబు కోసం పనిచేసే వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు. పదేళ్ళ క్రితమే పవన్ ను చంద్రబాబు దత్తత తీసుకున్నారని, అసలు కొడుకు అప్రయోజకుడు కాబట్టి పవన్ ని దత్తత తీసుకున్నారని చెప్పారు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకొనే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ కలసినా ఏమీ పీకలేవని, ఒకవేళ ప్రతిపక్షాల కుట్రలు ఫలిస్తే అధికారం చంద్రబాబుకు వస్తుందని, క్యాష్ పవన్ కు వస్తుందని.. మధ్యలో ప్రజలకు ఉపయోగం ఏమీ ఉండదని చెప్పారు నాని.
పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని టీడీపీ నేతలు ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు ఆదేశాలతోనే నారాయణ పేపర్ లీకేజీకి పాల్పడ్డారని అన్నారు కొడాలి నాని. చంద్రబాబు దొంగ పనులకు సహకరించిన వారికి జైలు తప్పదని హెచ్చరించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతోంది కూడా టీడీపీ నేతలేనని.. వారికి కూడా నారాయణకు పట్టిన గతే పడుతుందని అన్నారు నాని.