Telugu Global
NEWS

త్యాగాలు.. పిండాకూడు.. ఏదీ వద్దు " కొడాలి నాని..

రాష్ట్రంలో వైసీపీని గద్దె దించేందుకు అందరూ కలసి రావాలని, ఆ క్రమంలో టీడీపీ ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్న చంద్రబాబు వ్యాఖ్యలు రెండురోజులుగా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నీ త్యాగాలు మాకేమీ అవసరం లేదని, వాటితో మోసపోలేమని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. త్యాగాల పేరుతో రాజకీయపబ్బం గడుపుకునేందుకు చంద్రబాబు కొత్త వేషం వేశారంటూ వైసీపీ నాయకులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని ఈ త్యాగాల ఎపిసోడ్ పై […]

త్యాగాలు.. పిండాకూడు.. ఏదీ వద్దు  కొడాలి నాని..
X

రాష్ట్రంలో వైసీపీని గద్దె దించేందుకు అందరూ కలసి రావాలని, ఆ క్రమంలో టీడీపీ ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్న చంద్రబాబు వ్యాఖ్యలు రెండురోజులుగా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నీ త్యాగాలు మాకేమీ అవసరం లేదని, వాటితో మోసపోలేమని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. త్యాగాల పేరుతో రాజకీయపబ్బం గడుపుకునేందుకు చంద్రబాబు కొత్త వేషం వేశారంటూ వైసీపీ నాయకులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని ఈ త్యాగాల ఎపిసోడ్ పై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. “చంద్రబాబూ! రాష్ట్రానికి నీ త్యాగాలూ వద్దు, నీ పిండాకూడూ వద్దు” అని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకి చివరి ఎన్నికలని అన్నారు నాని.

తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశమైన కొడాలి నాని, రాష్ట్రంలో పొత్తు రాజకీయాలపై స్పందించారు. ఎవరెవరు కలిసినా, ఎన్ని గ్రూపులు వచ్చినా.. వారిని చెల్లాచెదురు చేయడానికి సింహం రెడీగా ఉందన్నారు. వైసీపీ ఓటుబ్యాంకు 50 శాతానికి పైగా అలానే ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ గెలుస్తుందని, జగనే మళ్ళీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మహిళలంతా తనకే ఓటు వేశారని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌ పై వ్యతిరేకత ఉందని చెప్తున్నారని, నిజంగా జగన్‌ పై వ్యతిరేకత ఉంటే బాబుకు మరో పార్టీ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు.

పవన్, లోకేష్ ఎమ్మెల్యేలుగా గెలవాలి కదా..?
చంద్రబాబుకు అధికారం, పవన్‌ కి డబ్బు కావాలని, అందుకే వారు పొత్తుల బేరం కుదుర్చుకుంటున్నారని ఆరోపించారు నాని. జగన్‌ ని ఓడించాలంటే.. ముందు పవన్, లోకేష్ ఎమ్మెల్యేలు కావాలి కదా, అప్పుడు చూద్దామంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్‌ తో, టీడీపీ-జనసేన పొత్తుతో ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పారు కొడాలి నాని.

First Published:  10 May 2022 2:29 AM IST
Next Story