నెల్లూరు జిల్లాలో దారుణం.. ప్రేమించిన యువతిని కాల్చి చంపిన యువకుడు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో దారుణం జరిగింది. పొదలకూరు మండలం తాడిపత్రి గ్రామంలో ఓ యువతిని సురేష్ అనే యువకుడు గన్ తో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సురేష్ తాను ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కొంత కాలంగా యువతిని సురేష్ వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా గ్రామస్తులు […]

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లో దారుణం జరిగింది. పొదలకూరు మండలం తాడిపత్రి గ్రామంలో ఓ యువతిని సురేష్ అనే యువకుడు గన్ తో కాల్చి చంపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న సురేష్ తాను ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కొంత కాలంగా యువతిని సురేష్ వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు. సురేష్ అక్కడికక్కడే మరణించగా, కొనఊపిరితో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్టు సమాచారం.