బలహీనవర్గాలకు పదవులు ఉండొద్దా?.. " ఎంపీ నందిగం సురేశ్
బలహీన వర్గాలకు పదవులు దక్కుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సహించలేకపోతున్నారని ఎంపీ నందిగం సురేశ్ వ్యాఖ్యానించారు. పదవులు ఎప్పుడూ అగ్రవర్ణాలకే దక్కాలా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు దక్కాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవన్నారు. ఓటుకు నోటు కేసులో పారిపోయిన చంద్రబాబు నాయుడిని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమేశారని పేర్కొన్నారు. అయితే ఏదో ఓ కుట్ర చేసి రాష్ట్రంలో అధికారంలోకి […]
బలహీన వర్గాలకు పదవులు దక్కుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సహించలేకపోతున్నారని ఎంపీ నందిగం సురేశ్ వ్యాఖ్యానించారు. పదవులు ఎప్పుడూ అగ్రవర్ణాలకే దక్కాలా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు దక్కాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవన్నారు. ఓటుకు నోటు కేసులో పారిపోయిన చంద్రబాబు నాయుడిని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమేశారని పేర్కొన్నారు. అయితే ఏదో ఓ కుట్ర చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు. 2014, 19 ఎన్నికల్లో సీఎం జగన్ ఒంటరిగా పోటీ చేశారన్నారు. చంద్రబాబుకు ఆ ధైర్యం లేక దత్తపుత్రుడి మద్దతు తీసుకుంటున్నారన్నారు. ‘నాతో కలిసిరండి అని ఆయన పిలుపునివ్వడం దిగుజారుడు తననానికి నిదర్శనమన్నారు. ఎవరు పొత్తులు పెట్టుకున్నా గెలుపు వైసీపీదేనని పేర్కొన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాష్ట్రంలో పదవులు దక్కాయని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఆయన వర్గం వారికే పదవులు దక్కుతాయని ఆరోపించారు. పవన్ కల్యాణ్ కు రాజకీయ ఎజెండా అంటూ లేదని విమర్శించారు. కేవలం చంద్రబాబు కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.