ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.7,259 కోట్లు.. " మంత్రి తలసాని
మన బస్తీ – మన బడి కార్యక్రమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,259 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 26,065 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఈ సొమ్ము కేటాయించిన ప్రభుత్వం మొదటి విడతగా 9,123 పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం 3,497 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి తలసాని. ఖైరతాబాద్ లోని రాజ్ భవన్ పాఠశాలలో, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట ధరంకరం […]
మన బస్తీ – మన బడి కార్యక్రమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,259 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 26,065 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఈ సొమ్ము కేటాయించిన ప్రభుత్వం మొదటి విడతగా 9,123 పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం 3,497 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి తలసాని.
ఖైరతాబాద్ లోని రాజ్ భవన్ పాఠశాలలో, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్ పేట ధరంకరం రోడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో మన బస్తీ – మన బడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 690 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతగా 239 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. మూడు విడతల్లో హైదరాబాద్ లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మంత్రి తలసాని చెప్పారు.