Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ

ప్రభాస్ సినిమాల్లో బాలీవుడ్ బ్యూటీస్ కామన్. ఎందుకంటే, అతడు పాన్ ఇండియా హీరో. కాబట్టి అతడి సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్-కె అనే సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్ ఉంది. స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్, అతడి సరసన నటిస్తోంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో బాలీవుడ్ బ్యూటీ వచ్చి చేరింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-కె సినిమాలోకి దిశా పటానీని కూడా తీసుకున్నారు. తాజాగా ఆమె సెట్స్ […]

ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ
X

ప్రభాస్ సినిమాల్లో బాలీవుడ్ బ్యూటీస్ కామన్. ఎందుకంటే, అతడు పాన్ ఇండియా హీరో. కాబట్టి అతడి సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్-కె అనే సినిమాలో కూడా బాలీవుడ్ హీరోయిన్ ఉంది. స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్, అతడి సరసన నటిస్తోంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో బాలీవుడ్ బ్యూటీ వచ్చి చేరింది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-కె సినిమాలోకి దిశా పటానీని కూడా తీసుకున్నారు. తాజాగా ఆమె సెట్స్ లోకి ఎంటరైంది. దిశా తమ ప్రాజెక్టులోకి ఎంటరైన విషయాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ ఘనంగా ప్రకటించింది. అటు దిశా కూడా ఈ ప్రాజెక్టులోకి వచ్చిన విషయాన్ని ఎనౌన్స్ చేసింది.

సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది దిశా. అయితే ఆమెకు, దీపిక పదుకోన్ కు సంబంధం ఉండదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సీన్లు ఉండవు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 90శాతం సినిమా షూటింగ్ ను సెట్స్ లోనే తీయబోతున్నారు.

First Published:  9 May 2022 12:24 AM IST
Next Story