Telugu Global
NEWS

శెట్టి బలిజలను వంచించింది చంద్రబాబే " మంత్రి చెల్లుబోయిన..

ఇటీవల ఓ బహిరంగ సభలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై వంగి నమస్కరించారు. ఆ తర్వాత దీనిపై పెద్ద రాజకీయ దుమారం రేగింది. శెట్టిబలిజల ప్రతినిధిగా ఉన్న మంత్రి చెల్లుబోయిన, వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై వంగి నమస్కరించడం ఏంటని ఆ సామాజిక వర్గం నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళనల వెనక టీడీపీ ఉందని, ఓ పథకం ప్రకారమే తనని టార్గెట్ చేశారంటున్నారు మంత్రి చెల్లుబోయిన. తాను జాతిని అవమానించానంటూ […]

శెట్టి బలిజలను వంచించింది చంద్రబాబే  మంత్రి చెల్లుబోయిన..
X

ఇటీవల ఓ బహిరంగ సభలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై వంగి నమస్కరించారు. ఆ తర్వాత దీనిపై పెద్ద రాజకీయ దుమారం రేగింది. శెట్టిబలిజల ప్రతినిధిగా ఉన్న మంత్రి చెల్లుబోయిన, వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్లపై వంగి నమస్కరించడం ఏంటని ఆ సామాజిక వర్గం నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే ఆందోళనల వెనక టీడీపీ ఉందని, ఓ పథకం ప్రకారమే తనని టార్గెట్ చేశారంటున్నారు మంత్రి చెల్లుబోయిన. తాను జాతిని అవమానించానంటూ ఈనాడు, ఏబీఎన్‌, టీవీ 5 తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించానని వివరణ ఇచ్చారు.

చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు కదా..?
తమ జాతికి న్యాయం చేసినందుకే తాను మోకాళ్లపై వంగి నమస్కరించారని, అంతేకాని రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదని అన్నారు మంత్రి చెల్లుబోయిన. కుడుపూడి చిట్టబ్బాయి వైఎస్‌ జగన్ వెంట నడిచారని, పార్టీ విజయం కోసం కృషి చేశారని, చిట్టబ్బాయికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావించారని, ఆ కుటుంబాన్ని వైసీపీ గౌరవించిందని, దానికి ముఖ్య కారణం వైవీ సుబ్బారెడ్డి కాబట్టి తాను అలా చేశానని, అది జాతిని అవమానించడం కాదని, జాతిని గౌరవించినవారికి తానిచ్చిన మర్యాద అని పేర్కొన్నారు మంత్రి చెల్లుబోయిన.

బాబు హయాంలో అలా.. జగన్ హయాంలో ఇలా..?
చంద్రబాబు శెట్టిబలిజలకు రెండు సీట్లు ఇమ్మంటే ఇవ్వకుండా అవమానించారని, 14 ఏళ్లలో చంద్రబాబు శెట్టిబలిజ వర్గానికి చెందిన ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు మంత్రి చెల్లుబోయిన. చైతన్యవంతులైన శెట్టిబలిజలు చంద్రబాబు ట్రాప్‌లో పడరని అన్నారు. ఇక వైసీపీ హయాంలోనే శెట్టి బలిజలకు సముచిత గౌరవం లభించిందని, శెట్టిబలిజ వర్గానికి సీఎం జగన్‌ ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చారని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ కి రాజ్యసభ అవకాశం ఇచ్చారని చెప్పారు. కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి తాను నమస్కరించానని, అయితే తన సామాజిక వర్గాన్ని అవమానించానంటూ తనపై ఓ పథకం ప్రకారం టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

First Published:  9 May 2022 7:51 AM IST
Next Story