అసమర్థుడి అంతిమ యాత్ర..
బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు చేస్తున్న జిల్లా యాత్రలు అసమర్థుడి అంతిమ యాత్రలా మారిపోయాయని తీవ్రంగా విమర్శించారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వచ్చే ఎన్నికల్లో ప్రజల బాదుడే బాదుడుతో టీడీపీ ఫినిష్ అవుతుందని అన్నారాయన. విద్యుత్ చార్జీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడుందని నిలదీశారు సీతారాం. బషీర్ బాగ్ లో పోలీస్ కాల్పులతో రైతుల మరణాలకు కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బషీర్ బాగ్ లో నాటి రక్తం మరకలు ఇంకా చంద్రబాబుకి అంటుకునే […]
బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు చేస్తున్న జిల్లా యాత్రలు అసమర్థుడి అంతిమ యాత్రలా మారిపోయాయని తీవ్రంగా విమర్శించారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వచ్చే ఎన్నికల్లో ప్రజల బాదుడే బాదుడుతో టీడీపీ ఫినిష్ అవుతుందని అన్నారాయన. విద్యుత్ చార్జీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడుందని నిలదీశారు సీతారాం. బషీర్ బాగ్ లో పోలీస్ కాల్పులతో రైతుల మరణాలకు కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బషీర్ బాగ్ లో నాటి రక్తం మరకలు ఇంకా చంద్రబాబుకి అంటుకునే ఉన్నాయని అన్నారు. ఆరోజు విద్యుత్ చార్జీల పెంపుతోనే రైతులు ఉద్యమం చేశారని గుర్తు చేశారు. వైెఎస్ఆర్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే.. బట్టలు ఆరబెట్టుకోడానికా అంటూ కామెంట్ చేశారని, అలాంటి చంద్రబాబు ఇప్పుడు వైసీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెరిగాయని గోల చేయడం హాస్యాస్పదం అని అన్నారు తమ్మినేని.
అసమర్థుడిని అందలం ఎక్కిస్తే..
మూడు సార్లు అధికారం ఇస్తే పరిపాలించడం చేతకాని అధముడు, నీఛుడు చంద్రబాబు అని విమర్శించారు తమ్మినేని సీతారాం. అసమర్దుడిని అందలం ఎక్కిస్తే ఏంజరుగుతుందో.. చంద్రబాబుని చూస్తే తెలుస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. ఇచ్చినమాట తప్పకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి మరీ వాటిని అమలు చేస్తున్న ఘనత జగన్ దేనని అన్నారు తమ్మినేని. మేనిఫేస్టో అమలు చేయడం చేతగాక.. దాన్ని ఇంటర్నెట్ నుంచి సైతం తీసేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు.
బీసీల చరిత్ర ఇదీ..
బీసీల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సృష్టికే దివ్య సందేశం అందించి, భగవద్గీత బోధించిన శ్రీకృష్ణుడు బీసీ అని అన్నారు తమ్మినేని. కురు సామ్రాజ్య పితామహుడు ..ఓ మత్స్యకారుడని చెప్పారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి బీసీ, గంగను భూమికి దించిన భగీరధుడు సైతం బీసీ అని చెప్పారు. భారత దేశం సమస్తం బీసీల మయం అని, ఈ చారిత్రక వాస్తవాలను కాదంటే చరిత్ర క్షమించదని చెప్పారు తమ్మినేని.