డెలివరీ బాయ్స్ పిల్లల చదువుల కోసం రూ. 700 కోట్ల విరాళం ఇచ్చిన జొమాటో సీఈవో
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ రూ. 700 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. తమ కంపెనీలో పని చేసే డెలివరీ పార్ట్‌నర్స్ పిల్లల చదువుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థకు ఈ రూ. 700 కోట్లు బదిలీ చేయడం ద్వారా.. వాటిని చిన్నారుల చదువులకు ఉపయోగించాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఆయనకు వచ్చిన ఈఎస్‌పీవోల నుంచి ఈ విరాళాన్ని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. […]
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఫౌండర్, సీఈవో దీపిందర్ గోయల్ రూ. 700 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. తమ కంపెనీలో పని చేసే డెలివరీ పార్ట్‌నర్స్ పిల్లల చదువుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థకు ఈ రూ. 700 కోట్లు బదిలీ చేయడం ద్వారా.. వాటిని చిన్నారుల చదువులకు ఉపయోగించాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఆయనకు వచ్చిన ఈఎస్‌పీవోల నుంచి ఈ విరాళాన్ని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జొమాటో కంపెనీ ఐపీవోకి వెళ్లడానికంటే ముందు ఆ సంస్థ ఇన్వెస్టర్లు, బోర్డు కలిసి పనితీరు ఆధారంగా గోయల్‌కు ఎంప్లాయిమెంట్ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్‌లను అందించాయి. వీటి గడుపు ప్రస్తుతం తీరిపోవడంతో అమ్మకానికి పెట్టారు. తన షేర్లను అమ్మడం ద్వారా వచ్చే రూ. 700 కోట్లను పూర్తిగా ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు గోయల్ ప్రకటించారు.
ఫౌండేషన్ ద్వారా సంస్థలో పని చేసే డెలివరీ పార్ట్‌నర్స్ కుటుంబంలోని ఇద్దరి పిల్లల చదువులకు సాయం అందిస్తామని చెప్పారు. కంపెనీలో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న డెలివరీ భాగస్వామ్యుల పిల్లలకు ఏడాదికి రూ. 50 వేలు, 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి పిల్లలకు ఏడాదికి రూ. 1 లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. పిల్లల ప్రతిభను బట్టి ఉన్నత చదువులకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. మరోవైపు డెలివరీ పార్ట్‌నర్ విధులు నిర్వర్తిస్తూ ప్రమాదానికి గురైతే.. సర్వీసుతో సంబంధం లేకుండా వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని గోయల్ వెల్లడించారు.