Telugu Global
Others

ఏసీ, కూలర్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

మే నెలలో ఎండలు మండిపోతుంటాయి. పైగా ఈ నెలలో చాలామంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. అందుకే ఇంట్లో చల్లదనం కోసం చాలామంది ఏసీ లేదా కూలర్లు కొంటుంటారు. మే నెలలో ఏసీ, కూలర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోతాయి. అయితే ఏసీ లేదా కూలర్ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ముఖ్యం. అవేంటంటే.. ఎయిర్ కూలర్స్‌లో పర్సనల్‌ కూలర్స్, డిసర్ట్‌ కూలర్స్‌ అనే రెండు రకాలుంటాయి. మీరుండే గది సైజుని బట్టి కూలర్లను ఎంచుకోవాలి. అలాగే […]

ఏసీ, కూలర్లు కొనేముందు ఇవి తెలుసుకోండి
X

మే నెలలో ఎండలు మండిపోతుంటాయి. పైగా ఈ నెలలో చాలామంది ఇంట్లోనే ఎక్కువ సమయం గడుపుతారు. అందుకే ఇంట్లో చల్లదనం కోసం చాలామంది ఏసీ లేదా కూలర్లు కొంటుంటారు.
మే నెలలో ఏసీ, కూలర్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోతాయి. అయితే ఏసీ లేదా కూలర్ కొనే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం ముఖ్యం. అవేంటంటే..

ఎయిర్ కూలర్స్‌లో పర్సనల్‌ కూలర్స్, డిసర్ట్‌ కూలర్స్‌ అనే రెండు రకాలుంటాయి. మీరుండే గది సైజుని బట్టి కూలర్లను ఎంచుకోవాలి. అలాగే కూలర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా ముఖ్యమే.

కూలర్లు కొనే ముందు లేటెస్ట్ ఫీచర్లు ఏమి ఉన్నాయో తెలుసుకుని కొనడం మంచిది. ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న కూలర్లలో ఆటోఫిల్ ఆప్షన్ వస్తుంది. అంటే నీళ్లు ఖాళీ కాగానే ఆటోమెటిక్‌గా ఫిల్ అవుతుందన్నమాట.

ఇకపోతే కూలర్లతో పోలిస్తే ఏసీలు ఎక్కువ ధర ఉంటాయి. ఇవి ప్రతీసారీ కొనేవి కావు. అందుకే ఏసీల విషయంలో ఎక్కువ మన్నిక ఉండేవి ఎంచుకోవాలి. ఏసీ కొనే ముందు ప్రతి కంపెనీ వెబ్‌సైట్ చూసి ఏసీ మోడల్‌, దాని ప్రత్యేకతలు తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

ఏసీలు కొనేముందు వారెంటీ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏసీతో పాటు, కండెన్సర్, కంప్రెషర్‌లు కూడా వారెంటీతో వస్తాయి. ఏ కంపెనీ ఎక్కువ వారెంటీ ఇస్తుందో తెలుసుకొని కొనాలి. అలాగే ఏ కంపెనీ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ బాగుందో రీవ్యూలు చూసి తెలుసుకోవడ మంచిది.

వీటితో పాటు మీ గదిని బట్టి స్ప్లిట్ ఏసీ కావాలా? విండో ఏసీ కావాలా అనేది నిర్ణయించుకోవాలి. అలాగే ఫిక్స్‌డ్ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీలతో కరెంట్ బిల్ తగ్గుతుంది. స్టార్ రేటింగ్‌ను బట్టి కూడా పవర్ యూసేజ్ మారుతుంటుంది. ఏసీలు కొనేముందు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.

First Published:  7 May 2022 11:58 AM IST
Next Story