వరంగల్ డిక్లరేషన్‌లోని 9 అంశాలు ఇవే..
రాహుల్ గాంధీ పాల్గొన్న ‘రైతు సంఘర్షణ సభ’లో కాంగ్రెస్ పార్టీ 9 అంశాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకునేందుకు చేపట్టే కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. స్టేజిమీద రాహుల్ గాంధీ ఉండగానే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వీటిని చదివి వినిపించారు. ఇవే ఆ అంశాలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా […]
రాహుల్ గాంధీ పాల్గొన్న ‘రైతు సంఘర్షణ సభ’లో కాంగ్రెస్ పార్టీ 9 అంశాలతో కూడిన వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకునేందుకు చేపట్టే కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. స్టేజిమీద రాహుల్ గాంధీ ఉండగానే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వీటిని చదివి వినిపించారు.
ఇవే ఆ అంశాలు..
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.
- ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రూ. 15 వేల ఆర్థిక సాయం చేస్తాం. భూమి లేని ఉపాధి హామీ, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల సాయం చేస్తాం.
- అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధర. ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేస్తుంది.
- మూతబడిన చక్కెర ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తాం. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.
- పంట నష్టం జరిగితే వెంటనే పరిహారం అందించేలా పంటల బీమా పథకం అమలు చేస్తాం. రైతు కూలీలు, భూమి లేని రైతులకు బీమా వర్తింపు. వ్యవసాయంతో ఉపాధి హామీ పథకం అనుసంధానం చేస్తాం.
- పోడు, అసైన్డ్ భూముల లబ్దిదారులకు క్రయ, విక్రయ అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తాం. ధరణి పోర్టల్ రద్దు. దాని స్థానంలో భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు.
- నకిలీ విత్తనాలు, పురుగు మందులపై సీరియస్ యాక్షన్. నిందితులపై పీడీ యాక్ట్. వారి ఆస్తులు జప్తు చేసి రైతులకు పరిహారం అందజేత.
- అసంపూర్ణ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తాం.
- రైతు సమస్యల పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు నూతన వ్యవసాయ విధానం. పంటల ప్రణాళిక అమలు.