Telugu Global
NEWS

ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్.. చంచల్ గూడ జైలుకు వెళ్లిన రాహుల్..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం చంచల్ గూడ జైలులో ఎన్ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. రాహుల్ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించాల్సి ఉండగా అక్కడి అధికారులు మొదట రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ ఆందోళన సందర్భంగా దాదాపు 18 మంది నేతలను పోలీసులు అరెస్ట్ చేసి .. చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిని రాహుల్ గాంధీ ఇవాళ కలుసుకున్నారు. రాహుల్ గాంధీ వెంబడి సీఎల్పీ […]

ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్.. చంచల్ గూడ జైలుకు వెళ్లిన రాహుల్..!
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం చంచల్ గూడ జైలులో ఎన్ఎస్‌యూఐ నేతలతో ములాఖత్ అయ్యారు. రాహుల్ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించాల్సి ఉండగా అక్కడి అధికారులు మొదట రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ ఆందోళన సందర్భంగా దాదాపు 18 మంది నేతలను పోలీసులు అరెస్ట్ చేసి .. చంచల్ గూడ జైలుకు తరలించారు.

వారిని రాహుల్ గాంధీ ఇవాళ కలుసుకున్నారు. రాహుల్ గాంధీ వెంబడి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఉన్నారు. చంచల్ గూడ జైలుకు వెళ్లక ముందు రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ‘అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిబద్ధత గల కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ ఆత్మ, వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ లో జోష్ ..

ఇదిలా ఉంటే వరంగల్ సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తమ నేత పర్యటన సక్సెస్ అయ్యిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. ముఖ్యంగా రైతుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందంటున్నారు. స్వచ్ఛందంగా రైతులు రాహుల్ మీటింగ్ కు వచ్చారని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఇందిరమ్మ రైతు భరోసా పథకం, గిట్టుబాటు ధరలు ఇస్తామని ఇచ్చిన హామీ పట్ల రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు.కౌలు రైతులు, రైతు కూలీలు సైతం సంతోషంగా ఉన్నారని వారు అంటున్నారు.

మరోవైపు వరంగల్ పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ ఓ ప్రైవేటు హోటల్ లో బస చేశారు. ఈ సందర్భంగా ఆయన పలువురు మీడియా అధినేతలతో సమావేశం అయినట్టు సమాచారం. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై ముఖ్యంగా చర్చించినట్టు సమాచారం. ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.

First Published:  7 May 2022 1:23 PM IST
Next Story