పరీక్షకు టైమంటే టైమే.. ఏపీ ఇలా..! తెలంగాణ అలా..!!
ఇటీవలే ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అర నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి వెళ్లనివ్వబోమని గతంలో కండిషన్లు పెట్టే అధికారులు ఈసారి మాత్రం లేటయినా పర్లేదంటూ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించారు. ట్రాఫిక్ జామ్ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు.. పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు కూడా గాభరా పడకుండా లోపలికి వెళ్తున్నారు. కానీ ఏపీలో పేపర్ లీకేజీ ఒక్కటే ప్రధాన సమస్యగా మారింది. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉండటం […]
ఇటీవలే ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అర నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి వెళ్లనివ్వబోమని గతంలో కండిషన్లు పెట్టే అధికారులు ఈసారి మాత్రం లేటయినా పర్లేదంటూ విద్యార్థులపై ఒత్తిడి తగ్గించారు. ట్రాఫిక్ జామ్ వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు.. పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు కూడా గాభరా పడకుండా లోపలికి వెళ్తున్నారు. కానీ ఏపీలో పేపర్ లీకేజీ ఒక్కటే ప్రధాన సమస్యగా మారింది. ఇందులో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉండటం గమనార్హం.
ఇక తెలంగాణ విషయానికొస్తే అక్కడ పదో తరగతి పరీక్షల కంటే ముందు ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతున్నాయి. కానీ తెలంగాణ అధికారులు మాత్రం నిమిషం నిబంధన కచ్చితంగా అమలు చేస్తామంటున్నారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్. 9గంటలకు నిమిషం లేటయినా లోపలికి అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు. 70శాతం సిలబస్ నుంచి 50శాతం ఛాయిస్ తో ప్రశ్నాపత్రం ఉంటుంది కాబట్టి.. పరీక్షల విషయంలో విద్యార్థులు భయపడాల్సిన అవసరం ఉండదని భరోసా ఇస్తున్నారు అధికారులు.
ఏపీ తరహాలో సెల్ ఫోన్లపై నిఘా..
ఏపీలో పరీక్ష పేపర్లు సెల్ ఫోన్ల ద్వారానే బయటకు వెళ్లిపోతున్నాయి. ఎగ్జామినర్లుగా వచ్చే ఉపాధ్యాయులే ఈతరహా మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నతాధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చే సిబ్బంది సెల్ ఫోన్లు వినియోగించడానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. పరీక్ష కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లను ముందుగానే చీఫ్ సూపరింటెండెంట్ వద్ద ఉంచాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నా పత్రాల సీల్ తీస్తారు. ఆ తర్వాత సరిగ్గా పరీక్ష టైమ్ కి ఓఎంఆర్ పత్రాలు విద్యార్థులకు ఇస్తారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న విద్యార్థులకు ప్రత్యేక గదులు కేటాయిస్తున్నారు. ఈనెల 24తో ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. జూన్ 24లోపు ఫలితాలు వెలువడే అవకాశముంది.