కరెంటు కోతలు.. రైల్వే ప్రయాణికుల పాట్లు..
ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్ కి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అయితే దానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే థర్మల్ పవర్ స్టేషన్లు నిరంతరం పనిచేయాలి. వాటికి అవసరమైన బొగ్గు నిరంతరం సరఫరా కావాలి. అంటే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లకంటే బొగ్గు తీసుకెళ్లే గూడ్స్ రైళ్లే ఎక్కువగా పట్టాలపై కనిపించాలి. దీంతో దేశవ్యాప్తంగా 650 రైలు సర్వీసులు రైళ్లు రద్దయ్యాయి. రిజర్వేషన్లు చేయించుకున్నవారు, వేసవి సెలవల్లో ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉరుము ఉరిమి చివరకు.. ఉరుము […]
ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్ కి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అయితే దానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే థర్మల్ పవర్ స్టేషన్లు నిరంతరం పనిచేయాలి. వాటికి అవసరమైన బొగ్గు నిరంతరం సరఫరా కావాలి. అంటే ప్రస్తుతం ప్యాసింజర్ రైళ్లకంటే బొగ్గు తీసుకెళ్లే గూడ్స్ రైళ్లే ఎక్కువగా పట్టాలపై కనిపించాలి. దీంతో దేశవ్యాప్తంగా 650 రైలు సర్వీసులు రైళ్లు రద్దయ్యాయి. రిజర్వేషన్లు చేయించుకున్నవారు, వేసవి సెలవల్లో ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఉరుము ఉరిమి చివరకు..
ఉరుము ఉరిమి మంగళంపై పడ్డట్టు.. దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడం, రైల్వే ప్రయాణికులకు అవస్థగా మారింది. ముఖ్యమైన ఎక్స్ ప్రెస్ రైళ్లు మినహా మిగతా ప్యాసింజర్ రైళ్లను ఎక్కడికక్కడ రద్దు చేసి ఆ స్థానంలో బొగ్గు తీసుకెళ్లే గూడ్స్ రైళ్లను నడుపుతోంది రైల్వే శాఖ. కరోనా కారణంగా ఆమధ్య రైళ్లలో రాకపోకలు స్తంభించాయి. ఇటీవలే ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించారు. ఇప్పుడు అనుకోకుంగా విద్యుత్ కోసం ప్యాసింజర్ రైళ్లతోపాటు కొన్ని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్ని కూడా ఆపేస్తున్నారు. దేశవ్యాప్తంగా 1100 ట్రిప్పులు రద్దు చేసింది రైల్వే శాఖ. 650 సర్వీసులు రద్దు చేసి వాటి స్థానంలో గూడ్స్ రైళ్లను నడుపుతోంది. విద్యుత్ డిమాండ్ తగ్గే వరకు ఈ పరిస్థితి తప్పదు అంటున్నారు అధికారులు.
దేశవ్యాప్తంగా 173 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 108 కేంద్రాలకు బొగ్గు సరఫరా తగినంతగా జరగడంలేదు. ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోని థర్మల్ ప్లాంట్ లు బొగ్గు కొరతతో సామర్థ్యానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయడంలేదు. విద్యుత్ కొరత నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరేళ్ల కాలంలో ఈ స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఎప్పుడూ లేదని అధికారులు ఆయనకు వివరించారు. గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా.. ఎలక్ట్రిక్ ఉపకరణాల వాడకం భారీగా పెరిగింది. దీంతో ఆటోమేటిక్ గా విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. అయితే దానికి తగ్గట్టుగా విద్యుత్ సప్లై లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో అనివార్యంగా బొగ్గు సరఫరా పెంచడం కోసం రైళ్లను రద్దు చేశారు. ఇలా కూడా ఇప్పుడు ప్రజలే ఇబ్బంది పడాల్సి వస్తోంది.