చేరికలను ఆహ్వానించండి.. అడ్డుకోవద్దు..
కొత్తవారు పార్టీలోకి వస్తున్నారంటే, సహజంగానే సీనియర్లకు కాస్త గుబులు ఉంటుంది. అప్పటి వరకూ తమకి పోటీగా ఉన్న నేతలు తమ పార్టీలోకి వస్తున్నారంటే మండల, గ్రామ స్థాయి నేతల్లో కూడా అభద్రతా భావం కామన్. అందుకే కొన్నిచోట్ల నాయకులు సుముఖంగా ఉన్నా చేరికలు అంత సులభం కావు, ఏవేవో అడ్డు పుల్లలు పడుతూనే ఉంటాయి. అయితే బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు ముందుగానే పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించాలి కానీ, అడ్డుకోవద్దని […]
కొత్తవారు పార్టీలోకి వస్తున్నారంటే, సహజంగానే సీనియర్లకు కాస్త గుబులు ఉంటుంది. అప్పటి వరకూ తమకి పోటీగా ఉన్న నేతలు తమ పార్టీలోకి వస్తున్నారంటే మండల, గ్రామ స్థాయి నేతల్లో కూడా అభద్రతా భావం కామన్. అందుకే కొన్నిచోట్ల నాయకులు సుముఖంగా ఉన్నా చేరికలు అంత సులభం కావు, ఏవేవో అడ్డు పుల్లలు పడుతూనే ఉంటాయి. అయితే బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు ముందుగానే పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించాలి కానీ, అడ్డుకోవద్దని చెప్పారు జేపీ నడ్డా. తెలంగాణలో బీజేపీని పటిష్టం చేయాలని సూచించారు.
ఎన్నికలకు ఏడాది ముందుగానే తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది అధిష్టానం. అందుకే జాతీయ నేతలు పదే పదే తెలంగాణ పర్యటనలకు వస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల వేళ పార్టీని మరింత పటిష్టపరచాలని, చేరికలను ప్రోత్సహించాలన్నారు. పార్టీలోకి వచ్చేవారిని అడ్డుకోవద్దని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ నుంచి కొంతమంది సీనియర్ నేతలు తమతో టచ్ లోకి వస్తున్నారని చెప్పారాయన. మరికొందరితో రాష్ట్ర నాయకత్వం టచ్ లోకి వెళ్లాలని, టీఆర్ఎస్ లోని అసంతృప్తులకు గాలం వేయాలన్నారు. మరోవైపు తెలంగాణలో అధికార పార్టీకి బీజేపీ ఏకైక ప్రత్యామ్నాయం అనే ప్రచారం తీసుకొచ్చి.. కాంగ్రెస్ లో కూడా గుబులు రేపాలని, నాయకులను తమవైపు తిప్పుకోవాలని సూచించారు. పార్టీలో ప్రాధాన్యతపై ఇంకొకరితో పోల్చుకోవద్దని సూచించిన నడ్డా.. “మీ కంటే బలమైన నేతలను మీరే పార్టీలోకి తీసుకు రండి” అంటూ సూచనలిచ్చారు.
టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రజాకార్ల సమితి అంటూ కొత్త నిర్వచనం చెప్పారు జేపీ నడ్డా. ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణకు దూరం చేసింది కేసీఆరేనని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్ట్ లను అధికార పార్టీ ఏటీఎంల లాగా మార్చుకుందని విమర్శించారు. కేంద్రం పథకాలు, కేంద్రం పైసలు ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ ని కోరుకుంటున్నారని, తెలంగాణలో బీజేపీ ప్రజాస్వామ్య యుతంగానే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు నడ్డా.