ఐరోపా బరువెక్కుతోంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..
భౌగోళిక, స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోరకమైన ఆహార అలవాట్లు, వ్యవహారాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు అందరికీ మంచివే. అయితే ఆ అలవాట్లు కట్టు తప్పితే.. అసలుకే మోసం వస్తుంది. ధనిక దేశాలన్నీ ఇప్పుడి ఇదే రకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా ఒబెసిటీతో బాధపడుతోందని, ఓ భయంకరమైన అంటువ్యాధిలా ఒబెసిటీ ఐరోపాను పట్టిపీడిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఐరోపాలోనే ఎందుకు..? ఐరోపా వాసుల ఆహార అలవాట్లు, పనివేళలు క్రమంగా మారిపోతున్నాయి. […]
భౌగోళిక, స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోరకమైన ఆహార అలవాట్లు, వ్యవహారాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు అందరికీ మంచివే. అయితే ఆ అలవాట్లు కట్టు తప్పితే.. అసలుకే మోసం వస్తుంది. ధనిక దేశాలన్నీ ఇప్పుడి ఇదే రకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా ఒబెసిటీతో బాధపడుతోందని, ఓ భయంకరమైన అంటువ్యాధిలా ఒబెసిటీ ఐరోపాను పట్టిపీడిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
ఐరోపాలోనే ఎందుకు..?
ఐరోపా వాసుల ఆహార అలవాట్లు, పనివేళలు క్రమంగా మారిపోతున్నాయి. వ్యాయామంపై శ్రద్ధ తగ్గుతోంది. ఫలితంగా ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. ఇతర ఖండాలతో పోల్చి చూస్తే ఐరోపాలో ఊబకాయుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగిగిందని WHO గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదు దశాబ్దాల కాలంలో 138శాతం ఊబకాయ సమస్య ఐరోపాలో పెరిగిందని అంటున్నారు.
వ్యాధులకు ఆహ్వానం..
అధిక బరువు అనేది వ్యాధులకు మూల కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువుతో అన్నిరకాల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనని చెబుతున్నారు. ఒబెసిటీ వల్ల ఐరోపాలో 12 రకాల క్యాన్సర్లు ఎక్కువగా కనపడుతున్నాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ బారినపడే రోగుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇక మరణాల విషయానికొస్తే.. ప్రతి ఏటా 12 లక్షలమంది ఊబకాయం వల్ల వచ్చిన వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. ఇకపై జాగ్రత్తలు తీసుకోకపోతే ఐరోపాలో ఇదో అంటువ్యాధిలా మారిపోతుందని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ఐరోపా యువతలో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. అత్యవసరంగా దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని, లేకపోతే ఊబకాయం వల్ల కలిగే మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని WHO హెచ్చరిస్తోంది.