Telugu Global
National

ఏసీ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ లు..

వేసవి ముందుగానే వచ్చింది. 120 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వేడి నెలగా ఏప్రిల్ రికార్డులకెక్కింది. అంతే కాదు.. ఏప్రిల్ లో ఏసీల అమ్మకాల్లో కూడా భారత్ లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 17.5 లక్షల ఏసీ యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే భారత్ లో ఏసీలకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 90లక్షల యూనిట్ల అమ్మకాన్ని టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెబుతున్నారు కన్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ […]

ఏసీ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ లు..
X

వేసవి ముందుగానే వచ్చింది. 120 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వేడి నెలగా ఏప్రిల్ రికార్డులకెక్కింది. అంతే కాదు.. ఏప్రిల్ లో ఏసీల అమ్మకాల్లో కూడా భారత్ లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 17.5 లక్షల ఏసీ యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే భారత్ లో ఏసీలకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 90లక్షల యూనిట్ల అమ్మకాన్ని టార్గెట్ గా పెట్టుకున్నట్టు చెబుతున్నారు కన్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఏప్రిల్ లో రికార్డ్ స్థాయి అమ్మకాలు జరిగాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డిమాండ్ ఎక్కువ.. సప్లై తక్కువ..
గతంలో ఏసీ కొనడానికి షో రూమ్ లకు వెళ్తే.. మనకు నచ్చిన మోడల్స్ దొరికేవి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నవాటినుంచి ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఫైవ్ స్టార్ మోడల్స్ మార్కెట్ లో దొరికే పరిస్థితి లేదు. చాలా చోట్ల నో స్టాక్ అంటున్నారు. వారం రోజుల్లో తెప్పించి ఇస్తామంటున్నారు. ఇక వేసవి ప్రారంభంలోనే ఏసీల రేట్లు భారీగా పెరిగాయి. 40వేల రూపాయలు లేనిదే ఓ మోస్తరు ఏసీ కొనలేని పరిస్థితి.

విడి భాగాల కొరత..
ఏసీ యూనిట్ లలో కీలకంగా ఉండే కంట్రోలర్స్, కంప్రెషర్స్ వంటి వాటికి భారీగా డిమాండ్ ఉంది. ఆయా విడి భాగాల కొరత వల్ల సరైన సమయానికి ఏసీలు సప్లై చేయలేకపోతున్నట్టు వివిధ కంపెనీలు చెబుతున్నాయి. అత్యథిక డిమాండ్ ఉన్న ఫైవ్ స్టార్, ఇన్వర్టర్ మోడల్స్ విషయంలో డిమాండ్ ఉన్నా.. దానికి తగ్గ స్థాయిలో కంపెనీలనుంచి సప్లై లేదు. ఇక ఏసీల అమ్మకాలు పెరగడం కూడా విద్యుత్ అత్యథిక వినియోగానికి పరోక్ష కారణం అని తెలుస్తోంది. ఏప్రిల్ లోనే విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో చాలా చోట్ల రాష్ట్రాలు చేతులెత్తేశాయి. కరెంటు కోతల సమస్య పలు చోట్ల ఎక్కువగా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాపై కేంద్రం కూడా పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది.

First Published:  4 May 2022 3:39 AM IST
Next Story