ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్.. కానీ చిన్న ట్విస్ట్..!
ఆర్ఆర్ఆర్ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఊరించి ఊరించి మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. ముఖ్యంగా తారక్, రామచరణ్ నటన.. రాజమౌళి మేకింగ్ ప్రేక్షకులను కొత్త లోకాలకు తీసుకెళ్లింది. ఇక కీరవాణి సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను మైమరిపించాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఆర్ఆర్ఆర్ […]
ఆర్ఆర్ఆర్ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఊరించి ఊరించి మార్చి నెలాఖరున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. ముఖ్యంగా తారక్, రామచరణ్ నటన.. రాజమౌళి మేకింగ్ ప్రేక్షకులను కొత్త లోకాలకు తీసుకెళ్లింది. ఇక కీరవాణి సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను మైమరిపించాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకొచ్చింది.
ఆర్ఆర్ఆర్ మూవీ జీ5, నెట్ ఫ్లిక్స్ లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం. అయితే ఇందులో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. కేవలం యూజర్లు ఆర్ఆర్ఆర్ చూడాలనుకుంటే ప్రత్యేకంగా మరికొంత మొత్తాన్ని చెల్లించాలట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం సంవత్సరానికి రూ. 1000 నుంచి రూ.1500 చెల్లించి వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫ్లామ్స్ ద్వారా యూజర్లు సినిమాలు చూస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు చూడాలంటే మాత్రం ప్రత్యేకంగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్ర విషయంలోనూ ఇటువంటి మెలిక పెట్టి.. మరికొంత లాభాన్ని ఆర్జించాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే జూన్ 3 నుంచి మాత్రం ఆర్ఆర్ఆర్ యూజర్లకు ఉచితంగా అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. మే 20 నుంచే చూడాలనుకొనేవారు మాత్రం ప్రత్యేకంగా కొంత మొత్తం చెల్లించాలట.