గాలి నాగేశ్వరరావు కోసం ప్రభుదేవా
మంచు విష్ణు చేస్తున్న సినిమా గాలి నాగేశ్వరరావు. సన్నీ లియోన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పాయల్ రాజ్ పుత్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పుడీ సినిమాకు మరో అదనపు ఆకర్షణ వచ్చి చేరింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, ఈ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ అందించబోతున్నాడు చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్నారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ కాంబినేషన్ లో […]
మంచు విష్ణు చేస్తున్న సినిమా గాలి నాగేశ్వరరావు. సన్నీ లియోన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. పాయల్ రాజ్ పుత్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పుడీ సినిమాకు మరో అదనపు ఆకర్షణ వచ్చి చేరింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా, ఈ సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ అందించబోతున్నాడు
చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమా కోసం ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్నారు. విష్ణు మంచు, పాయల్ రాజ్ ఫుత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తుండటం విశేషం. ఈ పాట సినిమాకి హైలైట్ అవుతుందనే నమ్మకంతో ఉంది చిత్రం యూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట షూటింగ్ జరుగుతోంది.
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు కోన వెంకట్. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించాడు.