అన్నంత పనిచేసిన రాజ్ ఠాక్రే.. మసీదుల ముందు హనుమాన్ చాలీసా..
రాజ్ ఠాక్రే అన్నంత పని చేశారు. మే – 3తో మసీదులకు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో.. ఈరోజు ఉదయాన్నే కొన్ని ప్రాంతాల్లో మసీదుల దగ్గర హనుమాన్ చాలీసాని లౌడ్ స్పీకర్లలో వినిపించారు. అలా వినిపిస్తున్న వీడియోలు.. లౌడ్ స్పీకర్ పట్టుకుని ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మసీదుల వద్ద అనుమతి లేకుండా ఉంచిన లౌడ్ స్పీకర్లు తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసారు రాజ్ ఠాక్రే. […]
రాజ్ ఠాక్రే అన్నంత పని చేశారు. మే – 3తో మసీదులకు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో.. ఈరోజు ఉదయాన్నే కొన్ని ప్రాంతాల్లో మసీదుల దగ్గర హనుమాన్ చాలీసాని లౌడ్ స్పీకర్లలో వినిపించారు. అలా వినిపిస్తున్న వీడియోలు.. లౌడ్ స్పీకర్ పట్టుకుని ఉన్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మసీదుల వద్ద అనుమతి లేకుండా ఉంచిన లౌడ్ స్పీకర్లు తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసారు రాజ్ ఠాక్రే.
మసీదుల వద్ద అజా ఇస్తున్న సమయంలోనే ప్రతిగా హనుమాన్ చాలీసా వినిపిస్తున్నారు ఎంఎన్ఎస్ కార్యకర్తలు. థానే సిటీలో ఉన్న ఇందిరా నగర్ లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను లౌడ్ స్పీకర్లలో ప్లే చేశారు. కానీ అక్కడికి సమీపంలో మసీదు లేదు. రాజ్ ఠాక్రే ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ముంబైలో అల్లర్లు జరగకుండా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇల్లు కదలనివ్వడంలేదు. ఇంటిలోనుంచే ఆయన ఎంఎన్ఎస్ తరఫున తన సందేశాలను సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. మసీదుల నుంచి వచ్చే అజా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే.. టోల్ ఫ్రీ నెంబర్ 100కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు రాజ్ ఠాక్రే.
రాజ్ ఠాక్రే చర్యలతో ప్రస్తుతం ముంబైతో పాటు మహారాష్ట్ర అంతటా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పుణేలో ఉన్న పూనేశ్వర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు అక్రమంగా మసీదుల వద్ద వినియోగిస్తున్న లౌడ్ స్పీకర్లను తొలగించనంత వరకు తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని ఠాక్రే చెప్పారు. మహారాష్ట్రలో 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని పోలీసుల్ని ఆయన ప్రశ్నించారు. మసీదులతోపాటు, చాలా వరకు ఆలయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా భారీ లౌడ్ స్పీకర్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. లౌడ్ స్పీకర్ల అంశం మతపరమైనది కాదని, అదో సామాజిక సమస్య అని అంటున్నారు రాజ్ ఠాక్రే.