Telugu Global
Cinema & Entertainment

జనతా బార్ లో లక్ష్మీరాయ్

రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడి ఓరియెంటెడ్‌ చిత్రం ‘జనతాబార్‌’. స్వీయ దర్శకత్వంలో రోచి శ్రీ మూవీస్‌ బ్యానర్ పై రమణ మొగిలి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రేపు రాయ్‌ లక్ష్మీ పుట్టినరోజు. ఆ సందర్భంగా చిత్రం టైటిల్‌ లోగోతో పాటు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. స్పోర్ట్స్‌ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. లైంగిక వేధింపులపై ఓ యువతి చేసిన పోరాటమే ఈ చిత్రం. అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో […]

జనతా బార్ లో లక్ష్మీరాయ్
X

రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేడి ఓరియెంటెడ్‌ చిత్రం ‘జనతాబార్‌’. స్వీయ దర్శకత్వంలో రోచి శ్రీ మూవీస్‌ బ్యానర్ పై రమణ మొగిలి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రేపు రాయ్‌ లక్ష్మీ పుట్టినరోజు. ఆ సందర్భంగా చిత్రం టైటిల్‌ లోగోతో పాటు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

స్పోర్ట్స్‌ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. లైంగిక వేధింపులపై ఓ యువతి చేసిన పోరాటమే ఈ చిత్రం. అన్ని కమర్షియల్‌ హంగులతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమాజానికి మంచి సందేశం కూడా వుంది. రాయ్‌లక్ష్మీ పాత్ర, ఆమె నటన చిత్రానికి హైలైట్‌గా వుంటుందంటున్నారు మేకర్స్.

నాలుగు పాటల మినహా టోటల్ షూటింగ్‌ పూర్తయింది. ఈ నెల 8 నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆ పాటలను చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటల్ని రాజేంద్ర భరధ్వాజ్ అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనతా బార్ ను ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం లక్ష్మీరాయ్ తక్కువగా సినిమాలు చేస్తోంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోవడం లేదు. తన పాత్రకు వెయిట్ ఉండే సినిమాలే చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తోంది. జనతా బార్ తో సౌత్ లో మరోసారి క్రేజ్ తెచ్చుకుంటానని చెబుతోంది లక్ష్మీ రాయ్.

First Published:  4 May 2022 4:01 PM IST
Next Story