Telugu Global
Health & Life Style

భారత్ లో కొత్త వేరియంట్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?

డెల్టా వేరియంట్ – వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా, తీవ్రత ఎక్కువ. ఒమిక్రాన్ – తీవ్రత తక్కువ, వ్యాప్తి బాగా ఎక్కువ.. ఎక్స్ఇ వేరియంట్ – వైరస్ వ్యాప్తి అత్యథికం.. తాజాగా ఈ ఎక్స్ఇ వేరియంట్ భారత్ లో కూడా బయటపడింది. మొదట ఇది బ్రిటన్ లో వెలుగు చూసింది. ఆ తర్వాత ఇతర దేశాల్లో కూడా ఈ వేరియంట్ వ్యాపించింది. గుజరాత్, మహారాష్ట్రలో ఎక్స్ఇ రకం కొవిడ్ వైరస్ వ్యాపిస్తోందని గతంలో ప్రచారం జరిగినా దాన్ని కేంద్రం అధికారికంగా ధృవీకరించలేదు. […]

భారత్ లో కొత్త వేరియంట్.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?
X

డెల్టా వేరియంట్ – వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్నా, తీవ్రత ఎక్కువ. ఒమిక్రాన్ – తీవ్రత తక్కువ, వ్యాప్తి బాగా ఎక్కువ.. ఎక్స్ఇ వేరియంట్ – వైరస్ వ్యాప్తి అత్యథికం.. తాజాగా ఈ ఎక్స్ఇ వేరియంట్ భారత్ లో కూడా బయటపడింది. మొదట ఇది బ్రిటన్ లో వెలుగు చూసింది. ఆ తర్వాత ఇతర దేశాల్లో కూడా ఈ వేరియంట్ వ్యాపించింది. గుజరాత్, మహారాష్ట్రలో ఎక్స్ఇ రకం కొవిడ్ వైరస్ వ్యాపిస్తోందని గతంలో ప్రచారం జరిగినా దాన్ని కేంద్రం అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఇప్పుడు ఇండియన్ సార్స్ కొవిడ్-2 కన్సార్షియం ఆఫ్ జీనోమిక్స్ (ఇన్సాకాగ్) సంస్థ ఎక్స్ఇ జాడ నిజమేనని చెప్పింది. అయితే ఈ కేసు ఏ రాష్ట్రంలో వచ్చిందనే విషయాన్ని మాత్రం ఇన్సాకాగ్ వెల్లడించలేదు.

కొవిడ్ వైరస్ ఉనికిలోకి వచ్చిన తర్వాత దానిలో సబ్ వేరియంట్లపై రకరకాల కథనాలు వచ్చాయి. థర్డ్ వేవ్ కి కారణం అయిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, తీవ్రత పెద్దగా లేకపోవడంతో భారత్ వంటి దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ఒమిక్రాన్ లో కూడా కొన్ని ఉపరకాలు ఆ తర్వాత బయటపడ్డాయి. బీఏ-1, బీఏ-2 గా భావిస్తున్న రెండు ఉపరకాలు కలిపి ఇప్పుడు ఎక్స్ఇ వేరియంట్ గా వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్ లో తొలిసారిగా ఈ వైరస్ జాడ కనపడగా.. ఇతర వేరియంట్ల కంటే దీనికి 10శాతం ఎక్కువగా వ్యాపించే లక్షణం ఉందని బ్రిటన్ పరిశోధకులు అంచనా వేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ వేరియంట్‌ అధిక సాంక్రమిక శక్తి కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా వెల్లడించింది.

ప్రస్తుతం భారత్ లోని 12 రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికిప్పుడు ఆందోళనకర పరిస్థితులు లేకున్నా.. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో R వేల్యూ 2 దాటడం మాత్రం ఇబ్బందిగా మారింది. ఇప్పుడీ ఎక్స్ఇ వేరియంట్ పై వస్తున్న వార్తలు ప్రజల్లో మరింత గందరగోళం సృష్టించే అవకాశముంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్ మస్ట్ అంటున్నాయి. మిగతా చోట్ల మెల్ల మెల్లగా ఆంక్షలు అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే ఎక్స్ఇ వేరియంట్ ని, భారత్ లో వ్యాక్సినేషన్ సమర్థంగా అడ్డుకోగలదా..? లేక ఫోర్త్ వేవ్ కి మానసికంగా సిద్ధం కావాల్సిందేనా..? వేచి చూడాలి.

First Published:  4 May 2022 3:26 AM IST
Next Story