Telugu Global
NEWS

సంస్థను కాపాడేందుకే అద్దె బస్సులు.. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవి కొనలేము: ఆర్టీసీ ఎండీ

ఏపీఎస్ ఆర్టీసీ కొత్తగా 998 అద్దె బస్సులకు టెండర్లు పిలిచింది. దీంతో సంస్థను ప్రైవేటుపరం చేయబోతున్నారని విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. ‘అద్దె బస్సులకు టెండర్లు పిలిచిన విషయం నిజమే. అయితే సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు. సంస్థను కాపాడేందుకే నిర్ణయం తీసుకున్నాం. అద్దె బస్సుల వల్ల సంస్థకు మరిన్ని బస్సులు పెరుగుతాయి. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది. వీటి […]

సంస్థను కాపాడేందుకే అద్దె బస్సులు.. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవి కొనలేము: ఆర్టీసీ ఎండీ
X

ఏపీఎస్ ఆర్టీసీ కొత్తగా 998 అద్దె బస్సులకు టెండర్లు పిలిచింది. దీంతో సంస్థను ప్రైవేటుపరం చేయబోతున్నారని విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. ‘అద్దె బస్సులకు టెండర్లు పిలిచిన విషయం నిజమే. అయితే సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకోలేదు. సంస్థను కాపాడేందుకే నిర్ణయం తీసుకున్నాం. అద్దె బస్సుల వల్ల సంస్థకు మరిన్ని బస్సులు పెరుగుతాయి. ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది.

వీటి నిర్వహణ బాధ్యత, కార్మికుల జీతభత్యాలు బస్సు యజమానులవే కాబట్టి.. సంస్థ మీద భారం పడదు. ఇప్పటికే ఆర్టీసీలో అద్దె బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం 23 శాతం అద్దె బస్సులున్నాయి. మేము కొత్తవి తీసుకోవడం వల్ల ఈ శాతం 32కు చేరుతుంది. వాణిజ్యపరంగా ఆర్టీసీకి లాభమే తప్ప నష్టం ఉండదు. ప్రస్తుతం సొంతంగా బస్సులు కొనుగోలు చేసే స్థోమత ఆర్టీసీకి లేదు.

ఒక్క మన రాష్ట్రంలోనే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటు పరంగా బాటలు వేస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అన్ని రాష్ట్రాల్లోనూ రవాణాసంస్థలు ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాయి. సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు.

First Published:  4 May 2022 2:47 PM IST
Next Story