Telugu Global
Cinema & Entertainment

సెటిల్ మెంట్ దిశగా ఆచార్య?

ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయింది. బయ్యర్లు లబోదిబోమంటున్నారు. దీంతో యూనిట్ రంగంలోకి దిగింది. బయ్యర్లకు భరోసా కల్పించేలా నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. ఆ సెటిల్ మెంట్ చర్చలు ఇవాళ్టి నుంచే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి.. ఆచార్య బయ్యర్లతో విడివిడిగా సమావేశం అవుతున్నారట. నష్టపోయిన నిర్మాతల్ని ఆదుకునేందుకు వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారట కొరటాల-నిరంజన్. చిరంజీవి, రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాల రైట్స్ ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. మరికొంతమందికి డబ్బు రూపంలో […]

సెటిల్ మెంట్ దిశగా ఆచార్య?
X

ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయింది. బయ్యర్లు లబోదిబోమంటున్నారు. దీంతో యూనిట్ రంగంలోకి దిగింది. బయ్యర్లకు భరోసా కల్పించేలా నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. ఆ సెటిల్ మెంట్ చర్చలు ఇవాళ్టి నుంచే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి.. ఆచార్య బయ్యర్లతో విడివిడిగా సమావేశం అవుతున్నారట.

నష్టపోయిన నిర్మాతల్ని ఆదుకునేందుకు వివిధ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారట కొరటాల-నిరంజన్. చిరంజీవి, రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాల రైట్స్ ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. మరికొంతమందికి డబ్బు రూపంలో నష్టపరిహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద ఎలాంటి అసంతృప్తి పైకి రాకుండా మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఓవైపు ఇంత చర్చ జరుగుతుంటే, మరోవైపు చిరంజీవి, భార్యతో కలిసి హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లిపోయారు. అటు రామ్ చరణ్, శంకర్ సినిమా పనిలో పడిపోయారు. కొత్త షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లిపోయారు. కొరటాల-నిరంజన్ మాత్రమే డీలింగ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సోమవారం నుంచి ఆచార్య సినిమా పూర్తిగా పడిపోయిన సంగతి తెలిసిందే. ఆక్యుపెన్సీ 20శాతం కూడా ఉండడం లేదు. ఈ వీకెండ్ నాటికి సినిమా రన్ ముగిసేలా కనిపిస్తోంది. ఓవరాల్ గా బయ్యర్లకు 90 కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ భావిస్తోంది.

First Published:  4 May 2022 4:03 PM IST
Next Story