జగన్ గొప్పోడు..కాపులకు మేలు చేశాడు : టీడీపీ నేత ప్రశంసలు..!
ముఖ్యమంత్రి జగన్‌పై ఉదయం నిద్రలేచింది మొదలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు టీడీపీ నేతలు. చిన్నా చితకా నేతలు మొదలు సీనియర్ నేతల వరకు ఇదే వరస. జగన్‌ను ఎంత తిడితే.. చంద్రబాబు వద్ద తమకు అన్ని మార్కులు పడుతాయని వారు రెచ్చిపోతుంటారు. కొందరు సోషల్ మీడియాలో ట్వీట్లతో రెచ్చిపోతే.. మరికొందరు ప్రెస్ మీట్లు పెట్టి దూషణలకు దిగుతారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించాడో నేత. ముఖ్యమంత్రి జగన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో టీడీపీ రాష్ట్ర […]
ముఖ్యమంత్రి జగన్‌పై ఉదయం నిద్రలేచింది మొదలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు టీడీపీ నేతలు. చిన్నా చితకా నేతలు మొదలు సీనియర్ నేతల వరకు ఇదే వరస. జగన్‌ను ఎంత తిడితే.. చంద్రబాబు వద్ద తమకు అన్ని మార్కులు పడుతాయని వారు రెచ్చిపోతుంటారు. కొందరు సోషల్ మీడియాలో ట్వీట్లతో రెచ్చిపోతే.. మరికొందరు ప్రెస్ మీట్లు పెట్టి దూషణలకు దిగుతారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించాడో నేత. ముఖ్యమంత్రి జగన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి మంగళవారం టీడీపీ కాపు శాఖ కార్యాయాలన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జగన్‌ను పొగిడారు. కాపులకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారని వ్యాఖ్యానించారు. జగన్ వల్లే తెలుగుదేశం పార్టీ కూడా కాపులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోందని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఏపీలో కుల ప్రాతిపదికనే రాజకీయాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అన్నిపార్టీలూ సామాజిక సమీకరణాల ఆధారంగానే పదవులు కట్టబెడుతున్నాయి. ఇటీవల సీఎం జగన్ సైతం సామాజిక సమతుల్యం పాటించేలా మంత్రి వర్గ కూర్పు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో కదలిక మొదలైంది.
ఆ పార్టీకి మొదటి నుంచి బీసీలు అండగా ఉంటున్నారు. దీంతో వారిని దూరం చేసుకోకుండా ఉండేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న కాపులను తమవైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇటీవల సీఎం జగన్ మంత్రులు, ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అందరు ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తన దగ్గర ఉందని ఆయన చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వారు వెంటనే మారాలని.. లేదంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కూడా జగన్ హెచ్చరించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో తమకు దూరమైన వర్గాలను మచ్చిక చేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది.