'అడ్వాన్స్' గొడవ బయటపెట్టిన దర్శకుడు
ఒక నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకొని, మరో నిర్మాతకు సినిమా చేస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా వివాదం ఏర్పడుతుంది. దర్శకుడు పరశురామ్ విషయంలో అదే జరిగింది. 14 రీల్స్ నిర్మాతలు ఈ దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చారు. కానీ వాళ్లకు సినిమా చేయకుండా, మైత్రీ మూవీ మేకర్స్ పై సినిమా చేశాడు పరశురామ్. అదే సర్కారువారి పాట. ఇప్పుడీ వివాదంపై స్పందించాడు పరశురామ్. అది అసలు వివాదమే కాదంటూ తేల్చిపడేశాడు. 14 రీల్స్ నిర్మాతలు తనకు అడ్వాన్స్ ఇచ్చిన […]
ఒక నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకొని, మరో నిర్మాతకు సినిమా చేస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా వివాదం ఏర్పడుతుంది. దర్శకుడు పరశురామ్ విషయంలో అదే జరిగింది. 14 రీల్స్ నిర్మాతలు ఈ దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చారు. కానీ వాళ్లకు సినిమా చేయకుండా, మైత్రీ మూవీ మేకర్స్ పై సినిమా చేశాడు పరశురామ్. అదే సర్కారువారి పాట.
ఇప్పుడీ వివాదంపై స్పందించాడు పరశురామ్. అది అసలు వివాదమే కాదంటూ తేల్చిపడేశాడు. 14 రీల్స్ నిర్మాతలు తనకు అడ్వాన్స్ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ మహేష్ మూవీకి సంబంధించి నిర్మాతల్ని ఎంపిక చేసుకునే వెసులుబాటు తనకు లేదని పరశురామ్ అంటున్నాడు. మైత్రీ బ్యానర్ పై సర్కారువారి పాట సినిమా చేయాలనేది మహేష్ నిర్ణయమని, తను నిర్మాతను తీసుకెళ్లేంత సీన్, స్థాయి తనకు లేదన్నాడు.
ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు. మైత్రీ బ్యానర్ పై సినిమా చేస్తానని చెప్పినప్పుడు 14 రీల్స్ నిర్మాతలు కూడా చాలా సంతోషించారట. మహేష్ బాబుతో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు, ఆపేంత దుర్మార్గులం కాదని, హ్యాపీగా వెళ్లి సినిమా చేసి రావాలని షేక్ హ్యాండ్ ఇచ్చారట. పైగా మహేష్ బాబు అనే హీరో, 14 రీల్స్ బ్యానర్ కు ఆస్థాన నటుడనే విషయాన్ని కూడా పరశురామ్ గుర్తు చేస్తున్నాడు.
కాబట్టి, అడ్వాన్స్ తీసుకొని ఎగ్గొట్టానంటూ తనపై వచ్చిన ఆరోపణలు, అప్పట్లో నడిచిన వివాదంలో ఎలాంటి వాస్తవం లేదని పరశురామ్ స్పష్టం చేశాడు. మరోవైపు మోహన్ బాబు నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నాడనే పుకార్లపై స్పందిస్తూ, మోహన్ బాబును వ్యక్తిగతంగా వెళ్లి కలిశానని, ఆయనతో ఎలాంటి విబేధాలు లేవని తెలిపాడు.