డెలివరీ బాయ్ కష్టం చూడలేక.. బైక్ కొనడానికి సాయం చేసిన పోలీసులు
మనకు పోలీసులను చూస్తేనే నెగెటివ్ ఫీలింగ్ కలుగుతుంది. పోలీసులు అంటే కఠినాత్ములని, కర్కశంగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ పోలీసులు తాము అందరిలాగే ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తామని, తమకూ మానవత్వం ఉందని నిరూపించారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కష్టం చూడలేక బైక్ కొనడానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జిగా ఉన్న తహజీబ్ ఖాజీ ఎప్పట్లాగే గత సోమవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో జే […]
మనకు పోలీసులను చూస్తేనే నెగెటివ్ ఫీలింగ్ కలుగుతుంది. పోలీసులు అంటే కఠినాత్ములని, కర్కశంగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ పోలీసులు తాము అందరిలాగే ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తామని, తమకూ మానవత్వం ఉందని నిరూపించారు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కష్టం చూడలేక బైక్ కొనడానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జిగా ఉన్న తహజీబ్ ఖాజీ ఎప్పట్లాగే గత సోమవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో జే హాల్దే అనే వ్యక్తి సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తూ కనపడ్డాడు.
సైకిల్ మీద చెమటలు కక్కూతూ ఫుడ్ ఇవ్వడానికి వెళ్తున్న అతడిని ఆపి, ఖాజీ పూర్తి వివరాలు అడిగాడు. ప్రతీ రోజు సైకిల్ మీదనే అతడు ఫుడ్ డెలివరీ చేస్తున్నట్లు తెలుసుకొని చలించిపోయాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బైక్ కొనుక్కోలేక పోతున్నానని హాల్దీ చెప్పాడు. అతడు చెప్పిన విషయాలకు చలించిపోయిన ఖాజీ.. స్టేషన్‌లోని తన కోలీగ్స్‌తో కలసి బైక్ కోసం డౌన్ పేమెంట్ కట్టాడు. తనకు డౌన్ పేమెంట్ కడితే చాలని మిగిలిన ఈఐంఐలు తానే కట్టుకుంటానని హాల్దే పోలీసులకు చెప్పడం వల్లే వాళ్లు కనీస మొత్తం కట్టి బైక్ ఇప్పించారు.
పోలీసులు షోరూంకు వెళ్లి కొత్త బండిని తీసుకొని వచ్చారు. విజయ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో స్వయంగా ఆ బైక్ హాల్దేకు అందించారు. ఆ క్షణంలో హాల్దే ఆనందంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు సైకిల్ మీద రోజుకు 6 నుంచి 8 డెలివరీలు చేసే వాడినని.. ఇకమీద బైక్ పై 15 నుంచి 20 డెలివరీలు చేసి ఎక్కువ సంపాదిస్తానని చెప్పుకొచ్చాడు. తనకు సాయం చేసిన పోలీసులకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నాడు.