రెండో పెళ్లి చేసుకున్న భారత క్రికెట్ మాజీ ఓపెనర్
భారత క్రికెట్ మాజీ ఓపెనర్, ప్రముఖ క్రికెట్ వాఖ్యాత, బెంగాల్ క్రికెట్ జట్టు ప్రధాన శిక్షకుడు అరుణ్ లాల్ తన 66వ పడిలో రెండో వివాహం చేసుకొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తొలి భార్యతో పాటు లేటు వయసులో తనకూ తోడుగా ఉండటం కోసం అరుణ్ లాల్ రెండో పెళ్లికి సాహసించారు. తనకంటే 28 సంవత్సరాలు చిన్నదైన స్నేహితురాలు బుల్ బుల్ సాహాను ద్వితీయ కళత్రంగా స్వీకరించారు. తొలి భార్య అనుమతితోనే.. మొదటి భార్య రీనా నుంచి […]
భారత క్రికెట్ మాజీ ఓపెనర్, ప్రముఖ క్రికెట్ వాఖ్యాత, బెంగాల్ క్రికెట్ జట్టు ప్రధాన శిక్షకుడు అరుణ్ లాల్ తన 66వ పడిలో రెండో వివాహం చేసుకొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తొలి భార్యతో పాటు లేటు వయసులో తనకూ తోడుగా ఉండటం కోసం అరుణ్ లాల్ రెండో పెళ్లికి సాహసించారు. తనకంటే 28 సంవత్సరాలు చిన్నదైన స్నేహితురాలు బుల్ బుల్ సాహాను ద్వితీయ కళత్రంగా స్వీకరించారు.
తొలి భార్య అనుమతితోనే..
మొదటి భార్య రీనా నుంచి గతంలోనే విడాకులు తీసుకున్నా.. ఆమె అనారోగ్యం పాలుకావడంతో అరుణ్ లాల్ ఆమె ఆలనాపాలనా చూస్తూ వస్తున్నారు. క్రికెట్ కార్యకలాపాలలో చురుకుగా ఉన్న అరుణ్ లాల్ దగ్గరుండి చూసుకోలేకపోతున్న కారణంగా.. ఓ ఆసరా కోసమే తొలి భార్య అనుమతితోనే ద్వితీయ వివాహానికి సిద్ధమయ్యారు. గత నెలలోనే నిశ్చితార్థం చేసుకొన్న అరుణ్ లాల్ తాను పుట్టిపెరిగిన కోల్ కతా నగరంలోని ఓ హోటల్ వేదికగా బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో.. కొద్దిగంటల క్రితమే వేడుకగా వివాహం జరుపుకున్నారు. పీర్ లెస్ ఇన్ హోటల్ లో వివాహవిందును సైతం ఏర్పాటు చేశారు.
1980 దశకంలో బెంగాల్, భారత క్రికెట్ కు ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా సేవలు అందించిన అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ రంజీ జట్టుకు ప్రధాన శిక్షకుడిగా పనిచేస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా భారత క్రికెట్ తో అరుణ్ లాల్ అనుబంధం పెంచుకొన్నారు. చక్కటి క్రికెట్ వాఖ్యాతగా కూడా అరుణ్ లాల్ కు పేరుంది. 66 సంవత్సరాల వయసులో తన తొలిభార్య అనుమతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు.
క్యాన్సర్ ను గెలిచిన మొనగాడు..
1982- 1989 మధ్యకాలంలో భారతజట్టుకు సాంప్రదాయ టెస్టు, వన్డే క్రికెట్ ఫార్మాట్లలో అరుణ్ లాల్ ప్రాతినిథ్యం వహించారు. కుదురైన ఓపెనర్ గా గుర్తింపు తెచ్చుకొన్నారు. భారత్ తరపున 16 టెస్టు మ్యాచ్ లు ఆడిన అరుణ్ లాల్.. 13 వన్డేలలో సైతం ప్రాతినిథ్యం వహించారు. రిటైర్మెంట్ తరువాత జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తూ మంచి కామెంటీటర్ గా గుర్తింపు సంపాదించారు. అయితే 2016లో దవడ ఎముక క్యాన్సర్ తో క్రికెట్ కామెంట్రీకి దూరమయ్యారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడి విజేతగా నిలిచిన అనంతరం.. బెంగాల్ రంజీజట్టుకు చీఫ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టారు. 13 సంవత్సరాల విరామం తర్వాత బెంగాల్ జట్టు రంజీట్రోఫీ ఫైనల్ చేరడంలో కోచ్ గా అరుణ్ లాల్ పాత్ర ఎంతో ఉంది. భారత, బెంగాల్ క్రికెట్ కు గత మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తూ వస్తున్న అరుణ్ లాల్ 66 సంవత్సరాల వయసులోనూ చురుకుగా ఉంటూ వస్తున్నారు.