Telugu Global
NEWS

నారకాసుర పాలన నుంచి ఏపీ ప్రజలకు శాశ్వత విముక్తి " మంత్రి రోజా..

బాదుడే బాదుడు పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీపై మంత్రి రోజా మండిపడ్డారు. గతంలో ఏపీలో నారకాసుర పాలనను ప్రజలు సహించలేకపోయారని, భరించలేకే చంద్రబాబుని గద్దె దింపారని అన్నారామె. బాబు పాలన నుంచి ఏపీకి శాశ్వత విముక్తి లభించిందని చెప్పారు. ఆ తప్పులు సరిదిద్దుతున్నాం.. చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని, ప్రభుత్వం తరపున విద్యార్థుల ఫీజు చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు రోజా. ఆ బకాయిలు […]

నారకాసుర పాలన నుంచి ఏపీ ప్రజలకు శాశ్వత విముక్తి  మంత్రి రోజా..
X

బాదుడే బాదుడు పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెడుతూ ప్రజల్లోకి వెళ్తున్న టీడీపీపై మంత్రి రోజా మండిపడ్డారు. గతంలో ఏపీలో నారకాసుర పాలనను ప్రజలు సహించలేకపోయారని, భరించలేకే చంద్రబాబుని గద్దె దింపారని అన్నారామె. బాబు పాలన నుంచి ఏపీకి శాశ్వత విముక్తి లభించిందని చెప్పారు.

ఆ తప్పులు సరిదిద్దుతున్నాం..
చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ ని ఉద్దేశపూర్వకంగానే పక్కనపెట్టారని, ప్రభుత్వం తరపున విద్యార్థుల ఫీజు చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని అన్నారు రోజా. ఆ బకాయిలు 1800 కోట్ల రూపాయలు ఉన్నాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ తీర్చుతున్నామని చెప్పారు. సీఎం జగన్ పెద్ద మనసుతో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కూడా సరిదిద్దుతున్నారని, విద్యార్థులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నామని అన్నారు రోజా.

వైసీపీ హయాంలో నేరాలు తగ్గాయి..
వైసీపీ పాలనలో ఏపీలో నేరాలు తగ్గాయని, దీనికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ సాక్ష్యం అని అన్నారు రోజా. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం ఏపీలో నేరాలు మూడు శాతం మేర తగ్గాయని చెప్పారు. కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలపై విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. మహిళా రక్షణ పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఇప్పుడు బాదుడే బాదుడు అంటున్న చంద్రబాబు గతంలో.. వ్యాట్, విద్యుత్ చార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు. ఆర్టీసిని ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు చూస్తే, సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు మేలు చేశారని గుర్తు చేశారు మంత్రి రోజా. కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆగకుండా ప్రజలకు అండగా నిలబడిన ప్రభుత్వం తమదని చెప్పారు.

First Published:  3 May 2022 4:21 PM IST
Next Story