Telugu Global
NEWS

హైదరాబాద్ థండర్ ఉమ్రాన్ మాలిక్.. గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్

టాటా ఐపీఎల్ 15వ సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ స్పీడ్ గన్, యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కూ తన బౌలింగ్ వేగాన్ని పెంచుకొంటూ క్రికెట్ పండితులను, కేంద్ర మాజీమంత్రి చిదంబరం లాంటి రాజకీయ నాయకులను ఫిదా చేస్తున్నాడు. పూణేలోని మహారాష్ట్ర‌ క్రికెట్ సంఘం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో ముగిసిన 9వ రౌండ్ పోటీలో ఉమ్రాన్ […]

హైదరాబాద్ థండర్ ఉమ్రాన్ మాలిక్.. గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్
X

టాటా ఐపీఎల్ 15వ సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ స్పీడ్ గన్, యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి జట్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కూ తన బౌలింగ్ వేగాన్ని పెంచుకొంటూ క్రికెట్ పండితులను, కేంద్ర మాజీమంత్రి చిదంబరం లాంటి రాజకీయ నాయకులను ఫిదా చేస్తున్నాడు. పూణేలోని మహారాష్ట్ర‌ క్రికెట్ సంఘం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో ముగిసిన 9వ రౌండ్ పోటీలో ఉమ్రాన్ మాలిక్ అత్యంత వేగవంతమైన బంతితో ప్రస్తుత 15వ సీజన్ కే సరికొత్త రికార్డు నెలకొల్పాడు. చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపైన గంటకు 154 కిలోమీటర్ల వేగంతో ఓ యార్కర్ ను సంధించడం ద్వారా సంచలనం సృష్టించాడు. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యంత వేగవంతమైన బాల్ గా రికార్డుల్లో చేరింది. ఆట ప్రారంభంలో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ పైన 154 కిలోమీటర్ల వేగంతో ఓ బంతిని విసరగా..ఆట 19వ ఓవర్లలో సైతం ధోనీ పైన అదే వేగంతో ఓ యార్కర్ ను సంధించాడు.

లాకీని అధిగమించిన ఉమ్రాన్..
ప్రస్తుత ఐపీఎల్ లో ఫాస్ట్ బౌలర్లు సంధించిన అత్యంత వేగవంతమైన మొదటి ఐదు బంతుల్లో ఉమ్రాన్ మాలిక్ వే నాలుగు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మాత్రమే 153.9 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగాడు. ఆ రికార్డును ఉమ్రాన్ మాలిక్ 154 కిలోమీటర్ల స్పీడ్ తో తెరమరుగు చేశాడు.
ప్రస్తుత సీజన్ మొదటి 9 రౌండ్ల మ్యాచ్ ల్లో ఉమ్రాన్ సంధించిన అత్యంత వేగవంతమైన బంతుల్లో ( 154, 153.3, 153.1, 152,9 కిలోమీటర్లు ) ఉండటం విశేషం. అంతేకాదు.. ప్రస్తుత సీజన్ ఓమ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టడం, మ్యాచ్ ఆఖరి ( 20వ ) ఓవర్ ను మేడిన్ గా ముగించటం లాంటి అసాధారణ రికార్డులు ఉమ్రాన్ పేరుతోనే ఉన్నాయి.

First Published:  2 May 2022 9:43 AM IST
Next Story