మాస్క్ తప్పనిసరే.. కానీ వ్యాక్సిన్ కాదు..
మాస్క్ లేనివారు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు అనే నిబంధన చాలా చోట్ల తిరిగి అమలులోకి వస్తోంది. అదే సమయంలో వ్యాక్సిన్ వేసుకోనివారికి ప్రవేశంలేదు అనే నిబంధన మాత్రం చట్ట విరుద్ధం అని చెబుతోంది సుప్రీంకోర్టు. తాజాగా వ్యాక్సిన్ కంపల్సరీపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ టీకా వేసుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేయకూడదంటూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది కోర్టు. ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానం ఏకపక్షంగా ఉందని చెప్పలేమంది, అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడం […]
మాస్క్ లేనివారు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు అనే నిబంధన చాలా చోట్ల తిరిగి అమలులోకి వస్తోంది. అదే సమయంలో వ్యాక్సిన్ వేసుకోనివారికి ప్రవేశంలేదు అనే నిబంధన మాత్రం చట్ట విరుద్ధం అని చెబుతోంది సుప్రీంకోర్టు. తాజాగా వ్యాక్సిన్ కంపల్సరీపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ టీకా వేసుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేయకూడదంటూ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది కోర్టు. ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానం ఏకపక్షంగా ఉందని చెప్పలేమంది, అదే సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కేంద్రం డేటా విడుదల చేయాలని ఆదేశించింది.
నిబంధనలు వద్దు..
వ్యాక్సిన్ తీసుకోనివారు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదు అంటూ కొన్ని చోట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయితే ఇది కరెక్ట్ కాదంటోంది సుప్రీంకోర్టు. ఆయా రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని ఆదేశించింది. వ్యాక్సిన్ విషయంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
దేశవ్యాప్తంగా ఇప్పటికి 189,23,98,347 డోసుల వ్యాక్సిన్ ను కేంద్రం పంపిణీ చేసింది. వయోజనులకు బూస్టర్ డోస్ పంపిణీ కొనసాగుతోంది. అదే సమయంలో చిన్నారుల టీకా ప్రక్రియ కూడా జోరందుకుంది. స్కూల్ పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ రెండో డోసు మొదలైంది. గతంలో వ్యాక్సిన్ తీసుకోవడంపై చాలామందికి అపోహలున్నా.. ఇటీవల కాలంలో స్వచ్ఛందంగా టీకా కోసం వస్తున్నారు. థర్డ్ వేవ్ తగ్గాక వ్యాక్సినేషన్ స్పీడ్ కూడా కాస్త తగ్గింది. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు మళ్లీ పెరగడం, ఫోర్త్ వేవ్ వస్తుందనే భయాందోళనల నేపథ్యంలో తిరిగి వ్యాక్సినేషన్ డ్రైవ్ ని రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి.