Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట ట్రయిలర్ రివ్యూ

టాలీవుడ్ లో మరో పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా ట్రయిలర్ ఈరోజు రిలీజైంది. అభిమానులు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ట్రయిలర్ విడుదలైన వెంటనే ట్రెండ్ అయింది. మహేష్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం. ట్రైలర్ విషయానికి వస్తే.. మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా సర్కారు వారి పాట అని ట్రైలర్ చూస్తే […]

సర్కారువారి పాట ట్రయిలర్ రివ్యూ
X

టాలీవుడ్ లో మరో పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అయింది. మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమా ట్రయిలర్ ఈరోజు రిలీజైంది. అభిమానులు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ట్రయిలర్ విడుదలైన వెంటనే ట్రెండ్ అయింది. మహేష్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.

ట్రైలర్ విషయానికి వస్తే.. మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా సర్కారు వారి పాట అని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. హైవోల్టేజ్ యాక్షన్, గ్రాండ్ విజువ‌ల్స్‌, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే డైలాగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది సర్కారు వారి పాట ట్రైలర్.

”నా ప్రేమ‌ని దొంగిలించ‌గ‌ల‌వు… నా స్నేహాన్నీ దొంగిలించ‌గ‌ల‌వు.. యూ కాన్ట్ స్టీల్ మై మ‌నీ..” అనే డైలాగ్‌తో మ‌హేష్ బాబు క్యారెక్టర్ ని పరిచయం చేయడం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ మూమెంట్ తెచ్చింది. ఇది కాకుండా.. ”అప్పనేది ఆడ‌పిల్ల లాంటిది సార్.. ఇక్కడెవ‌రూ బాధ్యత గ‌ల తండ్రిలా బిహేవ్ చేయ‌డం లేదు” లాంటి డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి.

ట్రైలర్ లో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ గా కనిపించాడు. అదే సమయంలో మాస్ యాక్షన్ తో అదరగొట్టాడు. దర్శకుడు పరశురాం మహేష్ బాబుని సరికొత్తగా చూపించి అభిమానులని అలరించాడు. మహేష్ బాబు కీర్తి సురేష్ జోడీ లవ్లీగా వుంది.

టెక్నికల్ గా సర్కారు వారి పాట అత్యన్నత స్థాయిలో వుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. తమన్ ట్రైలర్ కోసం కంపోజ్ చేసిన బీజీఏం స్కోర్ గ్రాండ్ గా వుంది. విజువల్స్ లావిష్ గా వున్నాయి. సర్కారు వారి పాట ట్రైలర్ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని ఇంకా పెంచేసింది. మే 12న థియేటర్లలోకి వస్తోంది సర్కారువారి పాట.

First Published:  2 May 2022 3:49 PM IST
Next Story