Telugu Global
Cinema & Entertainment

తన పెళ్లిపై వస్తున్న ప్రచారంపై సాయి పల్లవి క్లారిటీ..!

కథాబలం ఉన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తుందన్న పేరు హీరోయిన్ సాయి పల్లవి కి ఉంది. తనకు ఉన్న క్రేజ్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నప్పటికీ కేవలం సెలెక్టెడ్ చిత్రాల్లో మాత్రమే సాయిపల్లవి మొదటినుంచి నటిస్తోంది. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా సాయి పల్లవి అతి తక్కువ సినిమాల్లో మాత్రమే నటించింది. కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చకపోతే అది చిరంజీవి సినిమా అయినా సరే సాయి పల్లవి రిజెక్ట్ చేస్తుంది. ఇటీవల ఆమె తమిళంలో […]

తన పెళ్లిపై వస్తున్న ప్రచారంపై సాయి పల్లవి క్లారిటీ..!
X

కథాబలం ఉన్న చిత్రాల్లో మాత్రమే నటిస్తుందన్న పేరు హీరోయిన్ సాయి పల్లవి కి ఉంది. తనకు ఉన్న క్రేజ్ కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నప్పటికీ కేవలం సెలెక్టెడ్ చిత్రాల్లో మాత్రమే సాయిపల్లవి మొదటినుంచి నటిస్తోంది. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా సాయి పల్లవి అతి తక్కువ సినిమాల్లో మాత్రమే నటించింది. కథ, అందులో తన క్యారెక్టర్ నచ్చకపోతే అది చిరంజీవి సినిమా అయినా సరే సాయి పల్లవి రిజెక్ట్ చేస్తుంది.

ఇటీవల ఆమె తమిళంలో మారి-2, ఎన్జీకే, తెలుగులో లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటించింది. లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అయితే ఈ సినిమాల తర్వాత అటు తమిళంలో కానీ.. ఇటు తెలుగులో కానీ సాయి పల్లవి మరో చిత్రంలో నటించలేదు.

ఆమె ఒప్పందం చేసుకున్న సినిమాలు ప్రస్తుతం ఒక్కటి కూడా లేవు. దీంతో సాయి పల్లవి అతి త్వరలో పెళ్లి చేసుకోబోతోందని .. అందుకే కొత్త చిత్రాలు ఏవీ ఒప్పుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు సాయి పల్లవి వరకు చేరడంతో.. తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘ తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో నా కంటూ ప్రత్యేక గుర్తింపు, పేరు ఉంది. నేను కథా బలం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానన్న భావన ప్రేక్షకుల్లో ఉంది. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నాను. అంతకు మించి మరో కారణం ఏదీ లేదు’ అని సాయి పల్లవి తాజాగా వివరించింది.

First Published:  2 May 2022 7:12 AM IST
Next Story