Telugu Global
National

రాజకీయ నాయకులుగా అధికారుల అవతారం.. ఆంక్షలు విధించలేం..

సివిల్ సర్వీస్ అధికారులు, రాజకీయ నాయకుల స్నేహ సంబంధాలపై గతంలోనూ పెద్ద చర్చ జరిగింది. అధికార పార్టీ నేతలతో అధికారులు సన్నిహితంగా ఉండటం, వారికి అనుకూలంగా పనులు చేయడం, ఆ తర్వాత ఆ సేవలకు ప్రతిఫలం మరో రూపంలో పొందడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా నేరుగా రాజకీయ నాయకుల అవతారం ఎత్తేస్తున్నారు. గతంలో పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయ నాయకుల అండదండలతో ఇతర నామినేటెడ్ పదవులు పొందేవారు. కానీ ఇటీవల నేరుగా […]

రాజకీయ నాయకులుగా అధికారుల అవతారం.. ఆంక్షలు విధించలేం..
X

సివిల్ సర్వీస్ అధికారులు, రాజకీయ నాయకుల స్నేహ సంబంధాలపై గతంలోనూ పెద్ద చర్చ జరిగింది. అధికార పార్టీ నేతలతో అధికారులు సన్నిహితంగా ఉండటం, వారికి అనుకూలంగా పనులు చేయడం, ఆ తర్వాత ఆ సేవలకు ప్రతిఫలం మరో రూపంలో పొందడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా నేరుగా రాజకీయ నాయకుల అవతారం ఎత్తేస్తున్నారు. గతంలో పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయ నాయకుల అండదండలతో ఇతర నామినేటెడ్ పదవులు పొందేవారు. కానీ ఇటీవల నేరుగా ఖద్దరు ధరించడం కోసం పదవీ విరమణ ముందుగానే పాత అవతారం చాలించేస్తున్నారు.

రాజకీయ పార్టీలో చేరాలనే ఆలోచన ఉంటే కచ్చితంగా ఆ పార్టీకి మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటారు అధికారులు. అలా మేళ్లు చేసీ చేసీ చివరకు ఆ పార్టీ ప్రాపకం సంపాదించి సడన్ గా ఓ రోజు ఖద్దరు ధరిస్తారు. పార్టీ కండువా కప్పేసుకుంటారు. ఇలాంటి అధికారుల వల్ల ప్రజలకు ప్రయోజనం ఏంటి..? అసలు సివిల్ సర్వెంట్లు రాజకీయ నాయకులుగా మారడం సమంజసమేనా..? పోనీ రాజకీయాల్లో చేరాలనుకుంటే.. పదవీ విరమణ తర్వాత కొంతకాలం వారిపై నిషేధం (కూలింగ్ పీరియడ్) ఉండాలా..? ఈ విషయంపై మార్గదర్శకాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే ఈ పిల్ ని విచారణకోసం స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడం విశేషం.

సివిల్‌ సర్వీస్ అధికారులు పదవీ విరమణ, లేదా రాజీనామా చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకు రావాలని, ఆమేరకు శాసన వ్యవస్థను సుప్రీంకోర్టు ఆదేశించాలంటూ ఓ పిల్ దాఖలైంది. వివేక్ కృష్ణ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదని, ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని చెప్పింది ధర్మాసనం. పదవీ విరమణ తర్వాత సివిల్ సర్వీస్ అధికారులకు కూలింగ్ పీరియడ్ ఉండాలా.. వద్దా.. అనేది ఎన్నికల సంఘం సిఫారసు మేరకు తీసుకోవాల్సిన నిర్ణయం అని తేల్చి చెప్పింది. ఈమేరకు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. సంబంధిత పిల్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

First Published:  2 May 2022 3:47 AM IST
Next Story