Telugu Global
Cinema & Entertainment

మరో వారం రోజుల్లో ఎఫ్3 ట్రయిలర్

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ‘ఎఫ్3’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పుడా అంచనాలు మరింత పెంచడానికి మే 9న ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్ర యూనిట్. […]

మరో వారం రోజుల్లో ఎఫ్3 ట్రయిలర్
X

వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ‘ఎఫ్3’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఇప్పుడా అంచనాలు మరింత పెంచడానికి మే 9న ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్ర యూనిట్.

ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేయడం లేదు. నేరుగా ట్రయిలర్ లాంఛ్ చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎఫ్3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సినిమా ప్రధాన తారాగణం అంతా కనిపించిన ఈ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ని కంపోజ్ చేశాడు. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా వచ్చిన రెండో పాట ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ కూడా ట్రెండింగ్ లో వుంది.

తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్ లో సందడి చేయనుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైయింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్, శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్స్ దక్కించుకున్నాయి.

First Published:  2 May 2022 3:43 PM IST
Next Story