Telugu Global
National

లౌడ్ స్పీకర్ల తొలగింపుకి రేపే డెడ్ లైన్.. మహారాష్ట్రలో టెన్షన్ టెన్షన్..

మసీదుల ముందు ఉన్న లౌడ్ స్పీకర్లను మే 3లోగా తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలున్నట్టు ఆమధ్య ప్రచారం జరిగింది. కానీ రాజ్ థాక్రే వెనక్కి తగ్గలేదు, తగ్గేది లేదంటున్నారు. ఔరంగాబాద్ లో తాజాగా జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన లౌడ్ స్పీకర్ల తొలగింపు విషయంలో తామిచ్చిన డెడ్ లైన్ ని గుర్తు చేశారు. మే-3 లోగా మసీదుల […]

లౌడ్ స్పీకర్ల తొలగింపుకి రేపే డెడ్ లైన్.. మహారాష్ట్రలో టెన్షన్ టెన్షన్..
X

మసీదుల ముందు ఉన్న లౌడ్ స్పీకర్లను మే 3లోగా తొలగించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలున్నట్టు ఆమధ్య ప్రచారం జరిగింది. కానీ రాజ్ థాక్రే వెనక్కి తగ్గలేదు, తగ్గేది లేదంటున్నారు. ఔరంగాబాద్ లో తాజాగా జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన లౌడ్ స్పీకర్ల తొలగింపు విషయంలో తామిచ్చిన డెడ్ లైన్ ని గుర్తు చేశారు. మే-3 లోగా మసీదుల ముందు ఉన్న లౌడ్ స్పీకర్లు తొలగించకపోతే.. అక్కడే పోటీగా లౌడ్ స్పీకర్లు ఉంచి రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా వినిపిస్తామని హెచ్చరించారు.

హిందూ ఓట్లకోసమేనా..?
మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకోడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలకు శివసేన గండి గొట్టింది. కాంగ్రెస్, ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటినుంచి శివసేనను దెబ్బకొట్టేందుకు బీజేపీ రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా.. హిందూ ఓట్లను దూరం చేసేందుకు ఇలా రాజ్ థాక్రేను అడ్డు పెట్టుకుని బీజేపీ ప్లాన్ వేసిందని అంటున్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఉన్నట్టుండి రాజ్ థాక్రేకి మసీదుల దగ్గర ఉన్న లౌడ్ స్పీకర్లు గుర్తొచ్చాయని చెబుతున్నారు.

టెెన్షన్.. టెన్షన్..
దేశంలోని పలు ప్రాంతాల్లో హనుమాన్ శోభాయాత్రల విషయంలో జరిగిన ఆందోళనలు ఇంకా చల్లారలేదు. ఇప్పుడు కొత్తగా మహారాష్ట్రలో రాజ్ థాక్రే డెడ్ లైన్ పెట్టి మరీ గొడవ మొదలు పెట్టారు. అటు మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుమతులు లేని చోట్ల లౌడ్ స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగిస్తున్నారని చెబుతోంది. ఈ దశలో మే-3 తర్వాత మహారాష్ట్రలో పరిస్థితి ఎలా ఉంటుంది. శివసేన వర్సెస్ ఎంఎన్ఎస్ వార్ ఎలా నడుస్తుందనే విషయం ఆందోళన కలిగిస్తోంది.

First Published:  2 May 2022 7:33 AM IST
Next Story