Telugu Global
NEWS

రోడ్ల విషయంలో రాజీ వద్దు.. కొత్త రోడ్లు వేయండి: సీఎం జగన్ ఆదేశాలు..!

రోడ్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, ఇతర విపక్షాలు అవకాశం దొరికిన ప్రతిసారి రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని ఆరోపిస్తుంటాయి. ఇదిలా ఉంటే సీఎం జగన్ తాజాగా రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. గ్రామీణ రోడ్లను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం క్యాంపు ఆఫీస్‌లో సీఎం జగన్ పంచాయతీ రాజ్‌శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని […]

రోడ్ల విషయంలో రాజీ వద్దు.. కొత్త రోడ్లు వేయండి: సీఎం జగన్ ఆదేశాలు..!
X

రోడ్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, ఇతర విపక్షాలు అవకాశం దొరికిన ప్రతిసారి రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని ఆరోపిస్తుంటాయి. ఇదిలా ఉంటే సీఎం జగన్ తాజాగా రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. గ్రామీణ రోడ్లను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం క్యాంపు ఆఫీస్‌లో సీఎం జగన్ పంచాయతీ రాజ్‌శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు నిర్వహించి ఎక్కడెక్కడ రోడ్లు అవసరమో గుర్తించాలని సూచించారు.

అవసరమైన చోట రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని.. కొత్త రోడ్లు కూడా వేయాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. నిధుల విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని.. గ్రామాల్లో అంతర్గత రహదారులను కూడా వేయాలని ఆదేశించారు.

విపక్షాల ఆరోపణలకు చెక్
ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై తరచూ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం పొరుగు రాష్ట్రంలో రోడ్లు, విద్యుత్ వ్యవస్థ సరిగ్గా లేదంటూ పరోక్షంగా ఏపీపై కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి కాదని వివరణ ఇచ్చారు. ఈ లోగానే కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఏపీలో ప్రతిపక్ష నేతలు రెచ్చిపోయారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై విమర్శలు రాకూడదన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.

First Published:  2 May 2022 12:34 PM IST
Next Story