Telugu Global
Cinema & Entertainment

త్వరలోనే ఓటీటీలోకి ఆచార్య మూవీ

ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది. ఫస్ట్ వీకెండ్ కే మూవీ తేలిపోయింది. దీంతో ఇప్పటివరకు సినిమా చూడని జనాలంతా థియేటర్లను స్కిప్ చేశారు. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ గుడ్ న్యూస్ ఇది. ఆచార్య సినిమా నెల రోజుల ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. లెక్కప్రకారం.. ఆచార్య సినిమా జూన్ నెలలో స్ట్రీమింగ్ కు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ సినిమాను ఈ నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్నీ […]

త్వరలోనే ఓటీటీలోకి ఆచార్య మూవీ
X

ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది. ఫస్ట్ వీకెండ్ కే మూవీ తేలిపోయింది. దీంతో ఇప్పటివరకు సినిమా చూడని జనాలంతా థియేటర్లను స్కిప్ చేశారు. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ గుడ్ న్యూస్ ఇది. ఆచార్య సినిమా నెల రోజుల ముందుగానే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.

లెక్కప్రకారం.. ఆచార్య సినిమా జూన్ నెలలో స్ట్రీమింగ్ కు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ సినిమాను ఈ నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల మూడో వారంలో ఆచార్య సినిమా ఓటీటీలో ప్రత్యక్షం అవుతుంది.

చిరంజీవి-చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా సెట్స్ పై ఉంటుండగానే ఓటీటీ డీల్ లాక్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. దాదాపు 60 కోట్ల రూపాయలకు సౌత్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఈ సంస్థ దక్కించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవ్వడంతో, అగ్రిమెంట్ లో మార్పుచేర్పులు చేసి కాస్త ముందుగానే స్ట్రీమింగ్ కు పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఇంతకుముందు రాధేశ్యామ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రభాస్ హీరోగా నటించిన ఆ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. మార్చి 11న రిలీజైన ఆ సినిమా.. ఏప్రిల్ 1కే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఆచార్యను కూడా ఇదే విధంగా కాస్త ముందుగానే స్ట్రీమింగ్ కు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే కనుక జరిగితే 7 వారాల లాక్-ఇన్ పీరియడ్ ను చిరంజీవి కూడ పక్కనపెట్టినట్టే.

First Published:  2 May 2022 3:44 PM IST
Next Story