సింగిల్ సిట్టింగ్ 'కళావతి' ఇది
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పాటలొచ్చాయి. కానీ పెద్ద హిట్టయిన సాంగ్ మాత్రం ‘కళావతి’. ఈ పాట కోసం తమన్ ఎంతో కష్టపడి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. కానీ తమన్ మాత్రం అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు. సింగిల్ సిట్టింగ్ లో పాట పూర్తయిందని చెప్పుకొచ్చాడు. “ఒకటే వెర్షన్ కంపోజ్ చేశాను. అదే ఓకే అయింది. 2020 లాక్ డౌన్ లో చేసిన పాటది. నేను, […]
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారువారి పాట. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని పాటలొచ్చాయి. కానీ పెద్ద హిట్టయిన సాంగ్ మాత్రం ‘కళావతి’. ఈ పాట కోసం తమన్ ఎంతో కష్టపడి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. కానీ తమన్ మాత్రం అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు. సింగిల్ సిట్టింగ్ లో పాట పూర్తయిందని చెప్పుకొచ్చాడు.
“ఒకటే వెర్షన్ కంపోజ్ చేశాను. అదే ఓకే అయింది. 2020 లాక్ డౌన్ లో చేసిన పాటది. నేను, దర్శకుడు పరశురాం, గీత రచయిత అనంత శ్రీరామ్ జూమ్ కాల్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ పేరుతో అనుకున్న ఫస్ట్ లైను. నాకు సామజవరగమనా , దర్శకుడు పరశురాం కి ఇంకేం ఇంకేం కావాలె లాంటి మెలొడీస్ వున్నాయి. కచ్చితంగా ఆడియన్స్ చాలా అంచనాలతో వుంటారు, అన్నిటికంటే ముఖ్యం మహేష్ బాబు చాలా కాలం తర్వాత హీరోయిన్ పాత్రని ఉద్దేశించి పాడుతున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఇది చాలా ప్యూర్ గా డిజైన్ చేయాలనీ ముందే అనుకున్నాం. అలా కళావతి పాటతో కంపోజింగ్ స్టార్ట్ చేశాం. అయితే పాట కంపోజ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. ఈ గ్యాప్ లో పాటకు రోజు ప్రాణం పోస్తూ చివరిగా రిలీజ్ చేశాం. మా కష్టం వృధా కాలేదు. ఫాస్టెస్ట్ గా 150 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి సాంగ్ గా కళావతి పాట నిలిచిపోయింది.”
ఇలా కళావతి పాట వెనక సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు తమన్. ఈ సినిమా ప్రమోషన్ తాజాగా మొదలైంది. టెక్నీషియన్స్ ఒక్కొక్కరుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తమన్ కూడా తన అనుభవాల్ని పంచుకున్నాడు.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈనెల 12న థియేటర్లలోకి వస్తోంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది.