సమ్మతమే టీజర్ రివ్యూ
కిరణ్ అబ్బవరం నుంచి మరో సినిమా రెడీ అయింది. దాని పేరు సమ్మతమే. నిజానికి ఈ సినిమా సిద్ధమై చాన్నాళ్లయింది. కరోనా వల్ల రిలీజ్ లేట్ అయింది. మధ్యలో కిరణ్ నుంచి ఇంకో సినిమా రావడంతో, ఈ సినిమాకు గ్యాప్ తప్పలేదు. అలా చాన్నాళ్లు ల్యాబ్ లోనే ఉండిపోయిన ఈ సినిమా, ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్ లో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన సమ్మతనే టీజర్ చూడ్డానికి […]
కిరణ్ అబ్బవరం నుంచి మరో సినిమా రెడీ అయింది. దాని పేరు సమ్మతమే. నిజానికి ఈ సినిమా సిద్ధమై చాన్నాళ్లయింది. కరోనా వల్ల రిలీజ్ లేట్ అయింది. మధ్యలో కిరణ్ నుంచి ఇంకో సినిమా రావడంతో, ఈ సినిమాకు గ్యాప్ తప్పలేదు. అలా చాన్నాళ్లు ల్యాబ్ లోనే ఉండిపోయిన ఈ సినిమా, ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్ లో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు.
కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన సమ్మతనే టీజర్ చూడ్డానికి చాలా ఫ్రెష్ గా ఉంది. హీరోహీరోయిన్ల జంట కూడా బాగుంది. పెళ్లికి ముందు ప్రేమను ఇష్టపడని యువకుడిగా కిరణ్ ఇందులో నటించాడు. అయితే చాందిని తన జీవితంలోకి వచ్చిన తర్వాత, తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ.
కిరణ్ హిందీలో డైలాగ్స్ చెప్పడం, బెలూన్లను పేల్చేయడం లాంటి సీన్లు టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా సింక్ అయ్యాయి. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించగా, సతీష్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు.
ప్రవీణ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాకు గోపీనాధ్ రెడ్డి దర్శకుడు. జూన్ 24న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్నట్టు టీజర్ లో గ్రాండ్ గా ప్రకటించారు. సెబాస్టియన్ సినిమా ఫ్లాప్ తర్వాత కిరణ్ నుంచి వస్తున్న మూవీ ఇదే.