పరశురామ్ జీవితాన్ని మార్చిన మహేష్
గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నప్పటికీ, మహేష్ బాబు లాంటి హీరోను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం మహేష్ హీరోగా సర్కారువారి పాట సినిమాను డైరక్ట్ చేస్తున్నది ఇతడే. ఈ సందర్భంగా తన జీవితంలో మహేష్ ఎంతటి కీలక పాత్ర పోషించాడో చెప్పుకొచ్చాడు పరశురామ్. 2003లో ఏ కెరీర్ వైపు వెళ్లాలనే డైలమాలో ఉన్నాడట పరశురామ్. సినిమాల వైపు వెళ్దామా లేక సాఫ్ట్ వేర్ వైపు […]
గీతగోవిందంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్. ఆ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నప్పటికీ, మహేష్ బాబు లాంటి హీరోను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం మహేష్ హీరోగా సర్కారువారి పాట సినిమాను డైరక్ట్ చేస్తున్నది ఇతడే. ఈ సందర్భంగా తన జీవితంలో మహేష్ ఎంతటి కీలక పాత్ర పోషించాడో చెప్పుకొచ్చాడు పరశురామ్.
2003లో ఏ కెరీర్ వైపు వెళ్లాలనే డైలమాలో ఉన్నాడట పరశురామ్. సినిమాల వైపు వెళ్దామా లేక సాఫ్ట్ వేర్ వైపు వెళ్దామా అనే సందిగ్దంలో ఉన్నాడట. సరిగ్గా అదే టైమ్ లో మహేష్ నటించిన ఒక్కడు సినిమా రిలీజైందట. ఆ సినిమా చూసిన తర్వాత పరశురామ్ కు తన లక్ష్యం ఏంటో తెలిసొచ్చిందంట.
మరో ఆలోచన లేకుండా సినిమా రంగంవైపు వచ్చేశాడట పరశురామ్. అలా మహేష్ బాబు తన జీవితాన్ని మార్చేశాడని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మహేష్ ను డైరక్ట్ చేయాలనే టార్గెట్ తోనే పనిచేశాడట పరశురామ్. ఎట్టకేలకు సర్కారువారి పాట సినిమాతో తను అనుకున్నది సాధించాడు.
గీతగోవిందం రిలీజైన తర్వాత సర్కారువారి పాట స్టోరీ రాసుకోలేదట పరశురామ్. గీతగోవిందం సినిమా సెట్స్ పై ఉంటున్నప్పుడే ఈ లైన్ అనుకున్నాడట. అయితే ఈ స్టోరీలైన్ కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని తను కలలో కూడా ఊహించలేదని. గంట పాటు స్టోరీని వివరించిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి, సినిమా చేద్దామని మహేష్ చెప్పడంతో చాలా సంతోషం వేసిందంటున్నాడు ఈ డైరక్టర్.