Telugu Global
NEWS

కాళేశ్వరం వల్లే హైదరాబాద్ నీటి కష్టాలు తీరాయి.. గడ్కరీ వ్యాఖ్యలపై బీజేపీ మౌనం

తెలంగాణలో కాళేశ్వరం పేరెత్తగానే బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ అంతెత్తున లేస్తాయి. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోట్లాది రూపాయలు కమీషన్ల రూపంలో గుంజుతుందని, ఒక్క ఎకరాకు కూడా కొత్తగా సాగు నీటిని అందించలేదని విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ, సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఈ మాటలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లకు మరింత మద్దతు లభించింది. అదీ ఏకంగా కేంద్ర మంత్రి గడ్కరీ నోటి నుంచి రావడంతో […]

కాళేశ్వరం వల్లే హైదరాబాద్ నీటి కష్టాలు తీరాయి.. గడ్కరీ వ్యాఖ్యలపై బీజేపీ మౌనం
X

తెలంగాణలో కాళేశ్వరం పేరెత్తగానే బీజేపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ అంతెత్తున లేస్తాయి. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోట్లాది రూపాయలు కమీషన్ల రూపంలో గుంజుతుందని, ఒక్క ఎకరాకు కూడా కొత్తగా సాగు నీటిని అందించలేదని విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ, సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఈ మాటలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్లకు మరింత మద్దతు లభించింది. అదీ ఏకంగా కేంద్ర మంత్రి గడ్కరీ నోటి నుంచి రావడంతో బీజేపీ నాయకులకు ఏం చేయాలో అర్దం కావడం లేదు.

కాళేశ్వరం విషయంలో కేంద్ర మంత్రి గడ్కరీ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అడగ్గానే అనుమతులు మంజూరు చేశామని గడ్కరీ వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఆయన కాళేశ్వరంపై వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు వల్లే హైదరాబాద్ ప్రజలకు తాగు నీటి సమస్య తీరిందని చెప్పారు. దేశాభివృద్దిలో హైదరాబాద్, తెలంగాణ చాలా కీలకమని అన్నారు.

ఒకవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ కేసీఆర్ అభివృద్ది చేయలేదని విమర్శలు చేస్తున్న సమయంలోనే కేంద్ర మంత్రి ఇలా పాజిటివ్‌గా స్పందించడం బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్ర బీజేపీ ఒకవైపు టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తుంటే.. కేంద్రం నుంచి వచ్చిన వాళ్లు మాత్రం కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం ఏంటని మండిపడుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కచ్చితంగా కేసీఆర్ క్రెడిట్ అని రాష్ట్రమంతటా తెలుసు. ఇప్పుడు అది ఒక మంచి ప్రాజెక్టని బీజేపీ మంత్రి, అందులో కేంద్రంలో చాలా ముఖ్యుడైన గడ్కరీ వ్యాఖ్యానించడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అనుకోవచ్చు.

First Published:  30 April 2022 4:41 AM IST
Next Story