Telugu Global
NEWS

అవి అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు : మంత్రి కేటీఆర్

క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా ఏపీని ఉద్దేశిస్తూ అన్న మాటలపై శుక్రవారం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలే అని శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. ‘ఇవాళ ఒక మీటింగ్‌లో నేను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండవచ్చు. ఈ వ్యాఖ్యల్లో నాకు […]

అవి అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు : మంత్రి కేటీఆర్
X

క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా ఏపీని ఉద్దేశిస్తూ అన్న మాటలపై శుక్రవారం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలే అని శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు.

‘ఇవాళ ఒక మీటింగ్‌లో నేను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు ఏపీలోని నా స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండవచ్చు. ఈ వ్యాఖ్యల్లో నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఎవరిని బాధపెట్టాలనో.. కించపరచాలనో అలా మాట్లాడలేదు. నేను ఏపీ సీఎం జగన్‌ను ఒక బ్రదర్ లాగా భావిస్తున్నా. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నా’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, అంతకు ముందు టీఆర్ఎస్, వైసీపీ మంత్రులు ఈ వ్యాఖ్యలపై పరస్పరం మాటల యుద్దానికి దిగారు. బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించగా.. అంతే ఘాటుగా మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అయితే చివరకు కేటీఆర్ వివరణ ఇవ్వడంతో ఇది టీ కప్పులో తుఫానులా సమసి పోయింది.

First Published:  30 April 2022 2:43 AM IST
Next Story