Telugu Global
NEWS

బిగ్‌బాస్ షో వల్ల యువత చెడిపోతోంది : హైకోర్టు

టీవీల్లో చాలా పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. ఇండియాలోని పలు లాంగ్వేజ్‌ల‌లో ప్రసారం అవుతోంది. ఇప్పటికీ పలు సీజన్లు ముగించుకొని మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకొని పోతోంది. తెలుగులో కూడా స్టార్ మా చానల్‌లో నాగార్జున హోస్ట్‌గా ఈ బిగ్‌బాస్ షో నడుస్తోంది. మధ్యలో నాని, జూనియర్ ఎన్టీఆర్ కూడా హోస్టులుగా వ్యవహరించారు. తాజాగా, ఓటీటీలో కూడా బిగ్‌బాస్ షో రన్ చేస్తున్నారు. కాగా, ఈ షో చాలా అభ్యంతరకరంగా ఉందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ […]

బిగ్‌బాస్ షో వల్ల యువత చెడిపోతోంది : హైకోర్టు
X

టీవీల్లో చాలా పాపులర్ అయిన బిగ్‌బాస్ షో.. ఇండియాలోని పలు లాంగ్వేజ్‌ల‌లో ప్రసారం అవుతోంది. ఇప్పటికీ పలు సీజన్లు ముగించుకొని మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకొని పోతోంది. తెలుగులో కూడా స్టార్ మా చానల్‌లో నాగార్జున హోస్ట్‌గా ఈ బిగ్‌బాస్ షో నడుస్తోంది. మధ్యలో నాని, జూనియర్ ఎన్టీఆర్ కూడా హోస్టులుగా వ్యవహరించారు. తాజాగా, ఓటీటీలో కూడా బిగ్‌బాస్ షో రన్ చేస్తున్నారు. కాగా, ఈ షో చాలా అభ్యంతరకరంగా ఉందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి. రాజశేఖరరావుతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణకు స్వీకరించింది.

బిగ్‌బాస్ లాంటి షోల కారణంగా యువత చెడిపోతున్నదని, ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజంలో ప్రమాదకరమైన పోకడలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. సమాజాన్ని చెడగొడుతున్న ఇలాంటి షోలపై మేం తప్పకుండా స్పందిస్తాము. అభ్యంతరకరమైన టీవీ షోలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పిటిషన్‌ను సోమవారం విచారిస్తామని హైకోర్ట్ చెప్పింది.

కాగా, బిగ్‌బాస్ రియాల్టీ షో అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా ఉందని, దాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ 2019లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఇది ఒక మంచి పిటిషన్. ఎవరూ ఎందుకు ఈ షోపై స్పందించడం లేదని అనుకుంటున్నాము. తప్పకుండా ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలి. ఇలాంటి వాటితో మనకేం పని అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ మనం పట్టించుకోకపోతే ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు. భవిష్యత్‌లో మనకు సమస్య ఎదురైతే మిగతా వాళ్లు రారు అని హైకోర్టు అన్నది.

కాగా, 2019లో పిటిషన్ వేస్తే ఇంత వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదా అని కోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి చెప్పారు. దీంతో ఈ పిల్‌పై సోమవారం విచారణ జరుపుతామని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

First Published:  30 April 2022 4:29 AM IST
Next Story