Telugu Global
NEWS

బ్రేకింగ్ : సీఎస్కే కెప్టెన్ గా ధోనీ..!

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా మళ్లీ ఎంఎస్ ధోనీ ఎంపికయ్యాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోక పోవడంతో జడేజా స్థానంలో ధోనీ కెప్టెన్ గా మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. ధోనీ 2008 నుంచి చెన్నై కెప్టెన్ గా ఉన్నాడు. ఆ జట్టును ఏకంగా నాలుగు సార్లు చాంపియన్ గా నిలిపాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ […]

బ్రేకింగ్ : సీఎస్కే కెప్టెన్ గా ధోనీ..!
X

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా మళ్లీ ఎంఎస్ ధోనీ ఎంపికయ్యాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోక పోవడంతో జడేజా స్థానంలో ధోనీ కెప్టెన్ గా మళ్లీ బాధ్యతలు చేపట్టాడు. ధోనీ 2008 నుంచి చెన్నై కెప్టెన్ గా ఉన్నాడు. ఆ జట్టును ఏకంగా నాలుగు సార్లు చాంపియన్ గా నిలిపాడు. 2010, 2011, 2018, 2021 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సారథ్యంలో ఐపీఎల్ విజేతగా నిలిచింది. అలాగే ఇప్పటివరకు చెన్నై జట్టును ధోనీ 9 సార్లు ఫైనల్ కి తీసుకెళ్ళాడు.

ధోనీ ఇప్పటివరకు 204 మ్యాచ్ లు చెన్నైకి సారథ్యం వహించగా.. అందులో 121 విజయాలు అందుకొన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్ లో మాత్రం చెన్నై కి కెప్టెన్ గా వ్యవహరిస్తూ వచ్చాడు. ధోనీ వయసు ఇప్పటికే 40 దాటడంతో ఇంకెన్ని రోజులో క్రికెట్ ఆడే అవకాశం లేకపోవడంతో తన వారసుడిగా చెన్నై జట్టు కెప్టెన్ గా జడేజాను నియమించడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడు.

అయితే ఈ సీజన్ లో జడేజా సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. కెప్టెన్ గా జడేజా పూర్తిగా విఫలం అవుతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ పై జడేజా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేక పోతున్నాడు.

ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్సీని తిరిగి ధోనీకి అప్పగించాలని జడేజా నిర్ణయం తీసుకున్నాడు. తన నిర్ణయాన్ని సీఎస్కే జట్టు యాజమాన్యానికి తెలియజేశాడు. దీంతో చెన్నై కొత్త కెప్టెన్ గా ధోనీని ఎంపిక చేస్తూ సీఎస్కే జట్టు యాజమాన్యం ఒక ప్రకటన చేసింది. ఈ సీజన్లో తదుపరి మ్యాచులకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ధోని మళ్లీ కెప్టెన్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  30 April 2022 3:48 PM IST
Next Story