అప్పుడు అల్లరి.. ఇప్పుడు పరిణతి
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి. అలా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్2’ లో మెహ్రీన్ చేసిన హానీ పాత్ర కూడా ముందు వరుసలో వుంటుంది. హనీ మేనరిజం, అమాయకత్వం, అల్లరి ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి. ఇప్పుడు ఎఫ్2 లో హనీ పాత్రకు భిన్నంగా, ఎఫ్2కి మించిన వినోదం ‘ఎఫ్3’ తో పంచబోతున్నారు మెహ్రీన్. ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్రని అద్భుతంగా […]
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించే పాత్రలు వినోదానికి కేరాఫ్ అడ్రస్సులుగా అలరిస్తుంటాయి. అలా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం పంచిన పాత్రల్లో బ్లాక్ బస్టర్ హిట్ ‘ఎఫ్2’ లో మెహ్రీన్ చేసిన హానీ పాత్ర కూడా ముందు వరుసలో వుంటుంది. హనీ మేనరిజం, అమాయకత్వం, అల్లరి ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి. ఇప్పుడు ఎఫ్2 లో హనీ పాత్రకు భిన్నంగా, ఎఫ్2కి మించిన వినోదం ‘ఎఫ్3’ తో పంచబోతున్నారు మెహ్రీన్. ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి.
ఎఫ్2లో అల్లరిగా కనిపించిన మెహ్రీన్, ఎఫ్3లో మాత్రం పరిణతితో కూడిన హ్యూమర్ పండిస్తుందట. ఆమె పాత్రలో డిఫరెంట్ లేయర్స్ ఉంటూ పూర్తి వినోదాత్మకంగా ఉంటుందట. ఈ పాత్ర తన కెరీర్ లోనే ది బెస్ట్ ఎంటర్‌ట్రైనర్ రోల్ అవుతుందని మెహ్రీన్ నమ్మకంగా చెబుతోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా మెహ్రీన్ నటిస్తోంది. వెంకటేష్ భార్యగా తమన్న నటిస్తోంది. సోనాల్ చౌహాన్ మరో హీరోయిన్ గా అలరించనుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘F3’ థీమ్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అలాగే సెకెండ్ సింగిల్ ‘వూ.. ఆ.. ఆహా.. ఆహా..ఆహా’ పాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ట్రెండింగ్ లో వుంది.
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో సందడి చేయబోతోంది. మే 27న ఎఫ్3 సినిమా థియేటర్లలోకి వస్తోంది.