వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన కేజీఎఫ్2
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కేజీఎఫ్ 2 సినిమా మరో ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇంతకుముందు దంగల్, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలు మాత్రమే వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి చేరిన నాలుగో సినిమాగా నిలిచింది కేజీఎఫ్ ఛాప్టర్ 2 నార్త్ బెల్ట్ లో ఈ […]
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కేజీఎఫ్ 2 సినిమా మరో ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఇంతకుముందు దంగల్, బాహుబలి-2, ఆర్ఆర్ఆర్ సినిమాలు మాత్రమే వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లోకి ఎంటరయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి చేరిన నాలుగో సినిమాగా నిలిచింది కేజీఎఫ్ ఛాప్టర్ 2
నార్త్ బెల్ట్ లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. అక్కడ రిలీజ్ అవుతున్న డైరక్ట్ హిందీ సినిమాలు కూడా కేజీఎఫ్2 దాటికి కుదేలవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జెర్సీ మూవీ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కేజీఎఫ్ ధాటికి నిలవలేకపోయింది. మంచి కంటెంట్ ఉన్నప్పటికీ, షాహిద్ కపూర్ నటనకు ప్రశంసలు దక్కినప్పటికీ.. కేజీఎఫ్-2ను కాదని జెర్సీని చూసేందుకు అక్కడి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు.
బాలీవుడ్ ప్రముఖులు సైతం కేజీఎఫ్ హవాను అంగీకరించాల్సి వచ్చింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా ధాటికి బాలీవుడ్ లో ఏకంగా 3 సినిమాలు వాయిదా వేశారు. అంతెందుకు.. చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాను సైతం హిందీలో విడుదల చేయలేదు. అలా అప్రతిహతంగా సాగిపోతున్న కేజీఎఫ్2.. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
ఇప్పటికీ ఈ సినిమా ఇండియాలోని ఆల్ టైమ్ హిట్స్ దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇండియాలో ఆల్ టైమ్ హిట్స్ లో బాహుబలి-2 మొదటి స్థానంలో, రెండో స్థానంలో దంగల్ ఉన్నాయి. ఇప్పుడీ రేసులో కేజీఎఫ్2 సినిమా రెండో స్థానానికి ఎగబాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.