ఆచార్య మొదటి రోజు వసూళ్లు
చిరంజీవి-రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. అయితే సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. మేకర్స్ ప్రకటించిన సమాచారం మేరకు జీఎస్టీతో కలుపుకొని, ఆచార్య సినిమాకు మొదటి రోజు 33 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా చూసుకుంటే, ఈ సినిమాకు మొదటి రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రీమియర్స్ తో […]
చిరంజీవి-రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. అయితే సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. మేకర్స్ ప్రకటించిన సమాచారం మేరకు జీఎస్టీతో కలుపుకొని, ఆచార్య సినిమాకు మొదటి రోజు 33 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా చూసుకుంటే, ఈ సినిమాకు మొదటి రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
అటు ఓవర్సీస్ లో ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రీమియర్స్ తో కలుపుకొని ఫస్ట్ డేలోనే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇది 8 లక్షలకు పైగా డాలర్ల వసూళ్లు సాధించి మిలియన్ మార్క్ కు దగ్గరగా ఆగిపోయింది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 90 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. ప్రస్తుతం నడుస్తున్న టాక్ తో ఈ వసూళ్లు రాబట్టడం దాదాపు అసాధ్యం అంటోంది ట్రేడ్. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 7.90 కోట్లు
సీడెడ్ – రూ. 4.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.61 కోట్లు
ఈస్ట్ – రూ. 2.53 కోట్లు
వెస్ట్ – రూ. 2.90 కోట్లు
గుంటూరు – రూ. 3.76 కోట్లు
కృష్ణా – రూ. 1.90 కోట్లు
నెల్లూరు – రూ. 2.30 కోట్లు