మిథాలీరాజ్ బయోపిక్ రెడీ.. జూలై 15న శభాష్ మితు విడుదల
భారత మహిళాక్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్, హైదరాబాదీ దిగ్గజం మిథాలీరాజ్ జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది. తన జీవితానుభవాల ఆధారంగా నిర్మించిన సినిమా జూలై 15న విడుదల కానున్నట్లు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ స్వయంగా ప్రకటించింది. భారత మహిళాక్రికెట్ గతినే మార్చిన వెటరన్ బ్యాటర్ మిథాలీరాజ్, ఫాస్ట్ బౌలర్ ఝలన్ గోస్వామిల జీవితం ఆధారంగా వేర్వేరుగా సినిమాలు నిర్మిస్తున్నారు. మిథాలీ పాత్రలో తాప్సీ పన్ను.. తన వ్యక్తిగత జీవితాన్నే పణంగా పెట్టి […]
భారత మహిళాక్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్, హైదరాబాదీ దిగ్గజం మిథాలీరాజ్ జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది. తన జీవితానుభవాల ఆధారంగా నిర్మించిన సినిమా జూలై 15న విడుదల కానున్నట్లు భారత కెప్టెన్ మిథాలీ రాజ్ స్వయంగా ప్రకటించింది. భారత మహిళాక్రికెట్ గతినే మార్చిన వెటరన్ బ్యాటర్ మిథాలీరాజ్, ఫాస్ట్ బౌలర్ ఝలన్ గోస్వామిల జీవితం ఆధారంగా వేర్వేరుగా సినిమాలు నిర్మిస్తున్నారు.
మిథాలీ పాత్రలో తాప్సీ పన్ను..
తన వ్యక్తిగత జీవితాన్నే పణంగా పెట్టి భారత మహిళాక్రికెట్ కు 24 సంవత్సరాలపాటు అసమానసేవలు అందించిన పరుగుల రాణి, లేడీ టెండూల్కర్ మిథాలీరాజ్ క్రికెట్ జీవితం పై సినిమా పూర్తయ్యింది. మిథాలీరాజ్ పాత్రను ప్రముఖ నటి తాప్సీ పన్ను పోషించింది. క్రికెటర్ గా మిథాలీ ఆటతీరు, కదలికలు, హావభావాలను తాప్రీ అవపోసన పట్టి మరీ నటించింది. మిథాలీపాత్రలో తాప్సీ పరకాయప్రవేశం చేసిందని దర్శకుడు చెబుతున్నారు. 2017 మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత్ చేరడమే కాదు..ఫైనల్లో ఇంగ్లండ్ తో వీరోచితంగా పోరాడి రన్నప్ స్థానంతో సరిపెట్టుకొన్నసంఘటనలను సైతం చిత్రీకరించారు. 1999లో భారత్ తరపున తన తొలివన్డే మ్యాచ్ ఆడిన మిథాలీ గత 23 సంవత్సరాలుగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చింది. క్రికెట్ కోసం వివాహానికి దూరంగా ఉన్న మిథాలీ..ఆటకే అంకితమైపోయింది. తన జీవితంపై నిర్మించిన బయోపిక్ జూలై 15న విడుదల కానున్నట్లు ట్విట్టర్ ద్వారా మిథాలీ వెల్లడించింది. ఘనమైన లక్ష్యంతో బలమైన కలగన్న ఓ బాలిక జీవితమే శభాష్ మితు..అంటూ మిథాలీ ట్విట్ చేసింది. పెద్ద మనుషుల క్రీడ క్రికెట్లో ఓ బాలిక ఎలా రాణించిందీ, దేశంలోని కోట్లాదిమంది బాలికలకు, యువతులకు స్ఫూర్తిగా నిలిచిన తీరును అద్భుతంగా చిత్రీకరించారని తెలిపింది.
జులన్ పైనా బయోపిక్..
భారత వెటరన్ పేస్ బౌలర్ ఝలన్ గోస్వామి జీవితంపైనా చాక్డా ఎక్స్ ప్రెస్ పేరుతో ఓ బయోపిక్ నిర్మాణం ప్రారంభమయ్యింది. ఝలన్ గోస్వామి పాత్రను విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ పోషించనుంది. ఇటీవలే ముగిసిన 2022 ప్రపంచకప్ లో భారతజట్టు లీగ్ దశలోనే విఫలం కావడంతో.. మిథాలీరాజ్, ఝలన్ గోస్వామి త్వరలోనే తమ రిటైర్మెంట్ ను ప్రకటించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది.