Telugu Global
National

ఫలించిన భారత్ వ్యూహం.. దిగొచ్చిన చైనా..

ఎట్టకేలకు చైనా దిగొచ్చింది. చదువు మధ్యలో ఆపేసి భారత్ కి తిరిగొచ్చిన విద్యార్థులకు తిరిగి ఆహ్వానం పంపింది. ఈమేరకు భారత్ లోని చైనా ఎంబసీ వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఇన్నాళ్లూ ఎటూ తేల్చకుండా 23వేలమంది విద్యార్థుల భవితవ్యాన్ని గాల్లో దీపంలా ఉంచిన చైనా.. ఇప్పుడు రాయబారానికి రావడం విశేషమే. చైనీయుల టూరిస్ట్ వీసాలను భారత్ రద్దు చేసినట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (IATA) ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ఈ […]

ఫలించిన భారత్ వ్యూహం.. దిగొచ్చిన చైనా..
X

ఎట్టకేలకు చైనా దిగొచ్చింది. చదువు మధ్యలో ఆపేసి భారత్ కి తిరిగొచ్చిన విద్యార్థులకు తిరిగి ఆహ్వానం పంపింది. ఈమేరకు భారత్ లోని చైనా ఎంబసీ వద్ద తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సూచించింది. ఇన్నాళ్లూ ఎటూ తేల్చకుండా 23వేలమంది విద్యార్థుల భవితవ్యాన్ని గాల్లో దీపంలా ఉంచిన చైనా.. ఇప్పుడు రాయబారానికి రావడం విశేషమే. చైనీయుల టూరిస్ట్ వీసాలను భారత్ రద్దు చేసినట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (IATA) ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనతో ఇబ్బంది పడ్డ చైనా.. విద్యార్థుల విషయంలో సడలింపులు ఇచ్చింది.

చైనాలో కొవిడ్ వల్ల అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, ఇతర ఉద్యోగులు తిరిగి భారత్ కు వచ్చేశారు. ఆ తర్వాత చాలాకాలం విదేశీ ప్రయాణాలపై చైనా ఆంక్షలు విధించింది. ఇటీవల ఆంక్షలు తొలగించినా.. భారత్ మినహా ఇతర దేశాల విద్యార్థులకు మాత్రమే చైనా వెసులుబాటు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు 23వేలమంది భారత విద్యార్థులు చైనా నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు. చైనాకు తిరిగి వెళ్లలేక, ఇక్కడ చదువులు కొనసాగించలేక అవస్థలు పడుతున్నారు. భారత ప్రభుత్వం తరఫున జరిపిన సంప్రదింపులు కూడా ఫలించలేదు. దీంతో పరోక్షంగా చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు టూరిస్ట్ వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెలువడిన రెండు రోజుల వ్యవధిలోనే చైనా మెట్టు దిగింది, బెట్టు వీడింది. భారత్ కు తిరిగొచ్చేసిన విద్యార్థులకు తిరిగి ఆహ్వానం పలుకుతోంది.

చదువులు కొనసాగించేందుకు చైనా తిరిగి రావాలనుకునే భారత విద్యార్థులకు తాము అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు తెలిపారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌. కొవిడ్ తర్వాత చైనాకు తిరిగొచ్చిన ఇతర దేశాల విద్యార్థుల అనుభవాలను, భారత విద్యార్థులకు తాము తెలియజేశామని చెప్పారాయన. భారత విద్యార్థులు తిరిగొచ్చేందుకు వీలైన ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఈమేరకు భారత విద్యార్థుల జాబితాను ఇక్కడి చైనా ఎంబసీ రెడీ చేస్తోంది. అటు బీజింగ్ లోని భారత ఎంబసీ కూడా విద్యార్థులకు వ్యక్తిగతంగా సమాచారాన్ని పంపే పనిలో పడింది. విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుంటే.. వారికి చైనా అనుమతులు మంజూరు చేస్తుంది. అలా అనుమతులు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా కొవిడ్‌ విధి విధానాలను పాటించాలని చైనా సర్కారు స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన ఖర్చులను కూడా సొంతంగా భరించాలని చెప్పింది. మొత్తమ్మీద టూరిస్ట్ వీసాలను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిచ్చిందనే చెప్పాలి.

First Published:  29 April 2022 2:52 PM IST
Next Story